బెల్లంకొండ సురేష్ తనయుడు, సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా పరిచయమైన చిత్రం 'స్వాతి ముత్యం'.

కథ: బాలమురళీకృష్ణ (బెల్లంకొండ గణేష్) ప్రభుత్వ ఉద్యోగి. పెళ్లి చూపుల్లో భాగ్యలక్ష్మి (వర్ష)ను చూసి ప్రేమలో పడతాడు.

రాత్రి పెళ్లి అనగా... శైలజ (దివ్య శ్రీపాద) చంటి బిడ్డతో ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీకృష్ణ అని చెబుతుంది.

బాలమురళీకృష్ణ బిడ్డ అనడంతో పెళ్లి ఆగుతుంది. ఆ బిడ్డ ఎలా పుట్టాడు? మళ్ళీ బాల, భాగ్య ఎలా ఒక్కటయ్యారు? అనేది సినిమా.

ఎలా ఉంది? : 'స్వాతి ముత్యం' కథ సింపుల్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ మినహా స‌ర్‌ప్రైజ్ చేసే ట్విస్టులు ఏమీ ఉండదు.

కథలో గోదావరి నేపథ్యం మినహా ఫస్టాఫ్‌లో కొత్తదనం ఏమీ ఉండేది. ఇంటర్వెల్‌లో తర్వాత కామెడీ హైలైట్ అవుతుంది.

'స్వాతి ముత్యం'లో పాత్రలు నిజ జీవితంలో ఎక్కడో చూసినట్లు ఉంటాయి. ఆ సహజత్వం కథకు అందం తీసుకొచ్చింది.

బెల్లంకొండ గణేష్ నటన చూస్తే తొలి సినిమాలా అనిపించలేదు. చక్కగా చేశారు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా బావున్నారు. 

వర్షా బొల్లమ్మకు ఇటువంటి క్యారెక్టర్లు చేయడం అలవాటే. 'వెన్నెల' కిశోర్, నరేశ్ తదితరులు పాత్రలకు తగ్గట్టు చేశారు. 

'స్వాతి ముత్యం'లో అసలైన హీరోలంటే గోపరాజు రమణ, రావు రమేశ్. క్లైమాక్స్‌కు అరగంట ముందు నుంచి కామెడీతో కుమ్మేశారు.

కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా 'స్వాతి ముత్యం'. స్వచ్ఛమైన వినోదంతో నవ్విస్తుంది. చిన్న సందేశం ఇస్తుంది.

ఫస్టాఫ్ సోసోగా ఉన్నా...  'స్వాతి ముత్యం' సెకండాఫ్ చాలా బాగా ఎంట‌ర్‌టైన్‌ చేస్తుంది.