ఖరీదైన కారు కొన్న షన్ముఖ్, మీకు మాత్రమే లిఫ్ట్ ఇస్తాడట!

షన్ముఖ్ జస్వంత్ ఖరీదైన కొత్త కారు కొన్నాడు.

దసరా సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి షోరూమ్‌కు వెళ్లాడు.

BMW 2 series Gran Coupe కారు కొన్నాడు. కారు కలర్ భలే బాగుంది.

హైదరాబాద్‌లో ఆ కారు ఆన్ రోడ్ ధర రూ.55 లక్షలు వరకు ఉంది.

కారు కొంటున్న వీడియోను షన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ఇదంతా కలలా ఉందంటూ షన్ను ఎమోషనల్ క్యాప్షన్ పెట్టాడు.

‘‘నా ఫ్యామిలీ తర్వాత నన్ను ఈ పొజిషన్‌లో చూడాలనుకున్నది మీరే’’ అని తెలిపాడు.

‘‘స్నేహితులు కాదు, మరెవ్వరు కాదు. కేవలం మీరే. ఐ లవ్ యు 3000’’ అన్నాడు.

‘‘ఇది మన కార్, ఎప్పుడు కనిపించినా చెప్పండి, లిఫ్ట్ పక్కా’’ అని పేర్కొన్నాడు.

Images and Videos Credit: Shanmukh Jaswanth/Instagram