‘అన్‌స్టాపబుల్‌ -2’లో ఇక పాలిటిక్స్? ఫస్ట్ గెస్ట్ చంద్రబాబేనా?

నందమూరి బాలకృష్ణ మరోసారి ‘అన్‌స్టాపబుల్’తో వస్తున్నారు.

అయితే, ఈసారి సినీ తారలే కాకుండా పొలిటీషియన్స్ కూడా పాల్గోనున్నట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమానికి మొదటి గెస్ట్‌గా టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నట్లు సమాచారం.

ఈ మేరకు కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి.

చంద్రబాబుకు బాలయ్య, అల్లు అరవింద్ ఆహ్వానం పలకడాన్ని ఈ ఫొట్లో చూడొచ్చు.

ప్రశ్నలతో గెస్ట్‌లను తికమక పెట్టే బాలయ్య.. తన వియ్యంకుడికి ఏ ప్రశ్నలు వేస్తారో చూడాలి.

‘అన్‌స్టాపబుల్-2’లో నాగార్జున, చిరంజీవి సైతం పాల్గోనున్నారని తెలిసింది.

‘అన్‌స్టాపబుల్-2’కు సంబంధించిన టీజర్‌ను విజయవాడలో విడుదల చేశారు.

టీజర్‌లో బాలయ్య స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు.

Images Credit: Aha/Twitter