సోను సూద్ అంటే ఒకప్పుడు మన కళ్ల ముందే విలన్ మాత్రమే కనిపించేవాడు. కానీ, ఇప్పుడు సోనుసూద్ అంటే ఒక రియల్ హీరో కనిపిస్తున్నాడు. ఇందుకు కారణం కరోనా వైరస్ సమయంలో ఆయన చేసిన సేవ. సొంత ఖర్చులతో సోను అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. కరోనా వైరస్ తర్వాత కూడా సోనుసూద్ సేవలను కొనసాగించాడు. అడిగినవారికి కాదనుకుండా సాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా సోనుసూద్ ముంబయి రైల్వే స్టేషన్‌లో కనిపించాడు. సామాన్యుడిలా రైల్వేస్టేషన్ బల్లపై నిద్రపోయాడు. ఆ తర్వాత ఓ రైలులో బోగీలో ప్రయాణిస్తూ ఎంజాయ్ చేశాడు. చివరికి ముంబయి లోకల్ రైల్లో తిరుగుతూ కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. Images & Videos Credit: Sonu Sood/Instagram