తెలుగులో 'గ్యాంగ్ లీడర్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక అరుళ్ మోహన్.

ఆ తరువాత శ‌ర్వానంద్ శ్రీకారం చిత్రాల్లో ఈ అమ్మ‌డు హీరోయిన్‌గా న‌టించింది.

తెలుగులో పెద్దగా సక్సెస్ కానప్పటికీ తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటుంది.

అక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

గతేడాది శివ కార్తీకేయన్ హీరోగా నటించిన 'డాక్టర్'తో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 

తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుంది.

ఆ తరువాత 'ఎవరికీ తలవంచడు', 'డాన్' వంటి సినిమాల్లో నటించింది.

ప్రస్తుతం రజినీకాంత్ 'జైలర్' సినిమాలో నటిస్తోంది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.