‘ఆహా’ ఏం జనం, బాలయ్యపై అభిమానం ‘అన్‌స్టాపబుల్’ నందమూరి బాలకృష్ణ మరోసారి ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’తో వస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ‘ఆహా’ ఓటీటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడలో బాలయ్య అభిమానుల సాక్షిగా ‘అన్‌స్టాపబుల్’ సీజన్-2 టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో బాలయ్య స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. బాలయ్యను చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు వేదిక వద్దకు చేరుకున్నారు. జై బాలయ్య అంటూ ఫుల్ జోష్‌తో అభిమానులు కేరింతలు కొట్టారు. ‘అన్‌స్టాపబుల్’లో ఈసారి పొలిటీషియన్స్ కూడా పాల్గోనున్నట్లు తెలుస్తోంది. మొదటి గెస్ట్‌గా టీడీపీ అధినేత నారా చంద్రబాబు వస్తున్నట్లు సమాచారం. ‘అన్‌స్టాపబుల్-2’లో నాగార్జున, చిరంజీవి సైతం పాల్గోనున్నారని తెలిసింది. Images Credit: Aha/Twitter