కారుకు పూజ చేసిన కీర్తి సురేష్, నోరూరించే విందు! కీర్తి సురేష్ అంటే మన ఇంటి అమ్మాయిలాగే అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడు గ్లామర్ పాత్రలతో యూత్‌ను ఆకట్టుకుంటోంది కీర్తి. కీర్తికి ఫ్యామిలీతో టైంపాస్ చేయడమే ఎక్కువ ఇష్టం. సమయం దొరికినప్పుడు ఇంట్లోని తన పెంపుడు కుక్కతో టైంపాస్ చేస్తుంది. కీర్తి సాంప్రదాయాలకు ఎంతో విలువనిస్తుంది కూడా. దసరా సందర్భంగా కీర్తి సురేష్ పూజలు తన కారుకు పూజ చేసింది. ఆ తర్వాత తన పెంపుడు కుక్కను కారులో షికారుకు తీసుకెళ్లింది. ఆ ఫొటోలు, వీడియోను కీర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు, అరటి ఆకులో విందు భోజనం పిక్ కూడా పెట్టింది. Images & Videos Credit: Keerthy Suresh/Instagram