మోహన్ లాల్ మలయాళ సినిమా 'లూసిఫర్'ను తెలుగులో 'గాడ్ ఫాదర్'గా రీమేక్ చేశారు చిరంజీవి. సినిమా ఎలా ఉంది?

కథేంటి? : సీఎం పీకేఆర్ ఆకస్మిక మరణంతో, ఆ పదవి చేపట్టాలని అల్లుడు జైదేవ్ (సత్యదేవ్) ప్రయత్నాలు మొదలు పెడతాడు.

జైదేవ్ ప్రయత్నాలకు బ్రహ్మ (చిరంజీవి) అడ్డుపడతాడు. సీఎం కుమార్తె సత్య (నయనతార)కు బ్రహ్మ అంటే పడదు.

సత్య, బ్రహ్మ మధ్య మధ్య సంబంధం ఏంటి? డ్రగ్ మాఫియా అండతో జైదేవ్ సీఎం కాకుండా బ్రహ్మ ఏం చేశాడు? అనేది సినిమా

సినిమా ఎలా ఉంది? : మెగాస్టార్ వన్ మ్యాన్ షో చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్యాన్స్ విజిల్స్ వేసే మూమెంట్స్ ఉన్నాయి.

మెగాస్టార్ హీరోయిజాన్ని తమన్ నేపథ్య సంగీతం ఎలివేట్ చేసింది. 'నజభజ జజర' పాటను ఫైట్‌కు రీ రికార్డింగ్‌గా వినిపించడం బావుంది.

చిరుకు ధీటైన విలన్‌గా సత్యదేవ్ బాగా చేశారు. చిరు, సత్యదేవ్ మధ్య సన్నివేశాల్లో హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యింది. 

చిరు సోదరిగా నయనతార చక్కటి అభినయం కనబరిచారు. మురళీ శర్మ, సునీల్, బ్రహ్మాజీ పాత్రల పరిధి మేరకు చేశారు. 

'లూసిఫర్'తో పోలిస్తే 'గాడ్ ఫాదర్'లో చాలా మార్పులు చేశారు. ఇదొక డిఫరెంట్ పొలిటికల్ డ్రామా. 

హీరోయిజంపై దృష్టి పెట్టిన దర్శకుడు... ఎమోషన్స్, డ్రామాను వదిలేశారు. క్లైమాక్స్ సాదాసీదాగా, సాంగ్స్ సోసోగా ఉన్నాయి. 

ఫైనల్‌గా... మెగాస్టార్ మాస్ ఫీస్ట్ 'గాడ్ ఫాదర్'. ఫ్యాన్స్‌కు నచ్చుతుంది. 'లూసిఫర్' చూసినవాళ్లకు, ఆడియన్స్‌కు డీసెంట్ అనిపిస్తుంది.