సౌత్‌లో హీరోయిన్‌గా చేసిన రష్మిక, బాలీవుడ్ డెబ్యూ 'గుడ్ బై'లో డాటర్‌గా డిఫరెంట్ రోల్ చేశారు. ఈ సినిమా ఎలా ఉంది? కథ: హరీష్ (అమితాబ్) భార్య గాయత్రి (నీనా గుప్తా) మరణిస్తుంది. తల్లి మరణంతో పిల్లలు ఇంటికి వస్తారు. అంత్యక్రియల - దశదిన కర్మ వరకు ఏం జరిగింది? కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఏంటి? చివరికి ఏమైంది? అనేది సినిమా. 'గుడ్ బై' సినిమా కాన్సెప్ట్, కొన్ని సీన్స్... తెలుగు సినిమా 'ప్రతి రోజూ పండగే'లో కాన్సెప్ట్, సీన్స్‌కు సిమిలారిటీస్ ఉన్నాయి. మనిషి మరణించిన తర్వాత కుటుంబ సభ్యుల భావోద్వేగాలు, ఇరుగు పొరుగు చేసే హడావుడిని కళ్ళకు కట్టినట్లు చూపించారు. హ్యూమర్ & ఎమోషన్స్‌ను ఫస్టాఫ్‌లో దర్శకుడు చక్కగా బ్యాలన్స్ చేశారు. సెకండాఫ్‌లో మాత్రం ట్రాక్ తప్పింది. సెకండాఫ్‌లో కామెడీ తక్కువ, డ్రామా ఎక్కువ అయ్యింది. క్లాస్ పీకినట్లు ఉంది. కొన్ని సీన్స్‌లో కామెడీ వర్కవుట్ కాలేదు. రష్మిక, అమితాబ్, నీనా గుప్తా పాత్రల్లో జీవించారు. దర్శకుడి తప్పులను కవర్ చేసేలా నటించారు. అమిత్ త్రివేది అందరి కంటే కథకు ఎక్కువగా అర్థం చేసుకున్నారు. గుండెల్ని పిండేసే మ్యూజిక్ అందించారు. పేరెంట్స్‌ను పట్టించుకోని పిల్లలు, పేరెంట్స్ మరణం తర్వాత వాళ్ళ వేల్యూ తెలుసుకోవడం కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. రష్మిక నటనకు పేరొచ్చే ఛాన్స్ ఉన్నా... సినిమాను చూడటానికి కాస్త ఓపిక కావాలి. హిట్ అవ్వడం కష్టం.