స్టార్ హీరోలు చాలా మంది నెగెటివ్ రోల్స్ లో మెప్పించారు. నాని: 'వి' సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించారు నాని. వరుణ్ తేజ్: 'గద్దలకొండ గణేష్' సినిమాతో విలన్ గా పరిచయమయ్యారు వరుణ్ తేజ్. కార్తికేయ: 'గ్యాంగ్ లీడర్' సినిమాలో విలన్ గా కార్తికేయ నటన ఆకట్టుకుంటుంది. మాధవన్: 'సవ్యసాచి' సినిమాలో విలన్ గా కనిపించి షాకిచ్చారు. రానా: హీరో రోల్స్ తో పాటు విలన్ రోల్స్ లో కూడా అద్భుతంగా నటిస్తారు రానా. సుదీప్: కన్నడ స్టార్ హీరో సుదీప్ విలన్ రోల్స్ తో తెలుగులో ఫేమస్ అయ్యారు. ఆర్య: 'వరుడు' సినిమాలో విలన్ గా ఆర్య పెర్ఫార్మన్స్ పీక్స్ లో ఉంటుంది. నరేష్: 'నేను', 'విశాఖ ఎక్స్ ప్రెస్' లాంటి సినిమాల్లో విలన్ గా నరేష్ పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఆది పినిశెట్టి: 'సరైనోడు'లో వైరం ధనుష్ క్యారెక్టర్ లో ఆదిని తప్ప మరెవరినీ ఊహించుకోలేం. శ్రీకాంత్: 'యుద్ధం శరణం', 'అఖండ' సినిమాల్లో విలన్ గా మెప్పించారు. గోపీచంద్: 'నిజం' సినిమాలో గోపీచంద్ విలనిజాన్ని అంత ఈజీగా మర్చిపోలేం. ఎన్టీఆర్: 'జై లవకుశ' సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించారు.