Discount On Cars: రూ.9 లక్షల విలువైన SUVపై దాదాపు రూ.2 లక్షల డిస్కౌంట్, ఏంటి ఈ ఆఫర్?
Discount On Citroen Basalt, Aircrossr: సిట్రెన్ బసాల్ట్, ఎయిర్‌క్రాస్, C3 & eC3 మోడళ్లపై డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఎయిర్‌క్రాస్‌లో ఎక్కువ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

Bumper Discount Offers On Citroen SUVs: మీరు కార్ కొనాలని ఆలోచిస్తుంటే, సిట్రెన్ కార్లను (Citroen Cars) కూడా ఓసారి చూడండి. ప్రస్తుతం, సిట్రెన్ కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు నడుస్తున్నాయి. ఈ ఆఫర్ కింద, రూ. 1.70 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తాయి. సిట్రెన్ బసాల్ట్ (Citroen Basalt), ఎయిర్‌క్రాస్ (Citroen Aircross), C3 (Citroen C3) & eC3 (Citroen eC3 Aircross) మోడళ్లపై ఈ ఆఫర్‌ను కార్ కంపెనీ ప్రకటించింది. ఎయిర్‌క్రాస్, C3 & eC3 కార్‌లలో MY2023 మోడళ్లకు ఆఫర్ వర్తిస్తుంది. సిట్రెన్ బసాల్ట్ MY2024 మోడల్‌కు ఆఫర్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇది పరిమితకాల ఆఫర్, ఈ నెలాఖరు (మార్చి 2025) వరకే లైవ్‌లో ఉంటుంది.
సిట్రెన్ బసాల్ట్‌పై డిస్కౌంట్ ఆఫర్లు
సిట్రెన్ బసాల్ట్ ఒక కూపే SUV. ఈ కారుపై రూ. 1.70 లక్షల వరకు ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది. బసాల్ట్ చాలా వేరియంట్లు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తాయి. ఇది 110 hp శక్తిని & 190 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఇంజిన్‌తో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా అందుబాటులో ఉంది. సిట్రెన్ బసాల్ట్ కారు ఎక్స్ షోరూమ్ ధర (Citroen Basalt car ex-showroom price, Delhi) రూ. 8.25 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
సిట్రెన్ ఎయిర్‌క్రాస్‌పై డిస్కౌంట్ ఆఫర్లు
సిట్రెన్, తన ఎయిర్‌క్రాస్ మోడల్‌పై గరిష్ట ప్రయోజనాలను అందిస్తోంది. ఈ మోడల్‌పై రూ. 1.75 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఇది 5 సీటర్ & 7 సీటర్ కాన్ఫిగరేషన్స్‌తో వస్తుంది. సిట్రెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్-షోరూమ్ ధర (Citroen Aircross car ex-showroom price, Delhi) రూ. 8.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఫీచర్ కూడా ఉంది. ఈ వేరియంట్ల ఎక్స్ షోరూమ్ ధర (Citroen Aircross car ex-showroom price, Delhi) రూ. 13.25 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
సిట్రెన్ C3 పై రూ. 1 లక్ష విలువైన ప్రయోజనాలు
C3 కార్ మోడల్ మీద లక్ష రూపాయల వరకు తగ్గింపును సిట్రెన్ అందిస్తోంది. ఇది హ్యాచ్‌బ్యాక్. ఈ కారు వేరియంట్లలో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ అమర్చారు. టాప్-స్పెక్ వేరియంట్ షైన్ మాత్రమే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. సిట్రెన్ C3 ఎక్స్ షోరూమ్ ధర (Citroen C3 car ex-showroom price, Delhi) రూ. 6.16 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
సిట్రెన్ eC3 పైనా ఆఫర్
సిట్రెన్ eC3 పూర్తిగా ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్. 2025 మార్చి నెలాఖరు వరకు ఈ కారుపై రూ. 80 వేల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో 29.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. సిట్రెన్ కారు ముందు భాగంలో ఒకే మోటారు ఉంది, ఇది 57 hp పవర్‌ను & 143 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిట్రెన్ eC3 ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.





















