De-Tan Face Pack : కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి అప్లై చేస్తే స్కిన్ టోన్ బెటర్ అవుతుంది.. టాన్ని వదిలించుకోవడానికి అది మిక్స్ చేసేయండి
Glowing Skin with Coffee : కాఫీ పౌడర్ని ముఖానికి అప్లై చేస్తే చర్మానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. మరి ఈ కాఫీ పొడితో ఎలాంటి స్క్రబ్స్ వేసుకోవచ్చో.. వాటి వల్ల కలిగే లాభాలేంటో చూసేద్దాం.
Homemade Coffee Scrubs for Skin Brightening : చర్మం డల్‌గా మారిపోయిందా? టాన్ ఎక్కువైందా? పార్లర్‌కి వెళ్లేంత సమయం, డబ్బులు లేవా? అయితే మీరు ఇంట్లోనే మీ స్కిన్‌కి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వొచ్చు. ముఖ్యంగా డార్క్‌నెస్‌ని తగ్గించడంలో, షైనీగా మార్చడంలో ఇది హెల్ప్ చేస్తుంది. అదే కాఫీ పౌడర్. అవును కాఫీ పౌడర్ చర్మానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. అయితే కాఫీ తాగడం కాకుండా.. ఆ పౌడర్‌తో స్క్రబ్స్ చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
కాఫీ పౌడర్‌తో స్కిన్ టోన్‌ని మెరుగుపరచుకునేందుకు మీరు కొన్నిరకాల మాస్క్‌లు ట్రై చేయవచ్చు. ఇవి చర్మానికి మెరుపుతో పాటు పోషణను అందిస్తాయి. కాఫీ పౌడర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి.. వయసురీత్యా వచ్చే ఫైన్‌లైన్స్‌ను దూరం చేస్తాయి. ఇన్ఫ్లమేషన్, మంటను తగ్గిస్తాయి. హెల్తీ స్కిన్‌ను ప్రమోట్ చేస్తాయి. డార్క్ సర్కిల్స్‌ను దూరం చేస్తాయి. మరి స్కిన్‌కి కాఫీతో ఎలాంటి మాస్క్‌లు వేస్తే మంచి ప్రయోజనాలుంటాయో చూసేద్దాం.
కాఫీ, నిమ్మరసంతో
పార్టీలు లేదా సడెన్ మీటింగ్స్ ఏ ఇతర కారణంతో అయినా బయటకు వెళ్లేప్పుడు కాఫీ పౌడర్, నిమ్మరసంతో చేసిన పేస్ట్ బెస్ట్ ఆప్షన్. ఈ మాస్క్ అప్లై చేసిన తర్వాత 15 నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం చల్లని నీటితో కడిగితే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. కాఫీలోని క్లెన్సింగ్ లక్షణాలు, నిమ్మరసం కలిసి.. టాన్ని తీసేసి.. స్కిన్‌కి మెరుపును అందిస్తాయి.
కాఫీలో పాలతో కలిపితే..
కాఫీ పౌడర్‌ను ఒక టేబుల్‌స్పూన్ తీసుకోవాలి. దానిలో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల పాలు వేయాలి. దీనిని పేస్ట్‌గా చేసుకుని.. ముఖానికి అప్లై చేసి.. పది నుంచి పదిహేను నిమిషాలు ఉంచాలి. అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేస్తే స్కిన్ టోన్ మెరుగవుతుంది. మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
పసుపు, కాఫీ, యోగర్ట్
ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్‌లో ఒక టేబుల్ స్పూన్ పసుపు, యోగర్ట్ లేదా పెరుగు వేసి పేస్ట్‌గా చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల ఉంచి.. అనంతరం దానిని స్క్రబ్ చేస్తూ.. గోరువెచ్చని నీటితో కడగాలి. దీనివల్ల స్కిన్ టోన్ బ్రైట్‌గా మారుతుంది.
ఇలా చేసుకోవడం మీకు కుదరదు అనుకుంటే కాఫీతో తయారు చేసిన ప్రొడెక్ట్స్ మీరు ఉపయోగించవచ్చు. కానీ ఇంట్లో చేసుకోగలిగే ఈ మాస్క్‌లు మంచి ఫలితాలు ఇవ్వడంతో పాటు.. తక్కువ ఖర్చులో అందుబాటులో ఉంటాయి. వీటిని అప్లై చేసే ముందు డెర్మటాలజిస్ట్ సజెషన్స్ తీసుకుంటే మంచిది.
Also Read : పండుగలు, పూజలు, ఫంక్షన్లు సెలబ్రేషన్ ఏది అయినా శారీ కట్టుకోవాలనుకుంటే ఈ సెలబ్రెటీల లుక్స్ ఫాలో అయిపోండి