అన్వేషించండి

Smartphones Expensive: భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

Laptops More Expensive | మీరు కనుక స్మార్ట్‌ఫోన్, PC కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి. త్వరలో RAM వాడే అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్ ధరలు భారీగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

Smartphone Price Hike | మీరు 2026లో కొత్త స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ లేదా PC కొనుగోలు చేయాలని చూస్తున్నారా, అయితే అదనపు ఖర్చు పెట్టాల్సి రావొచ్చు. ఇందుకు కారణం మనం తరచుగా పట్టించుకోని ఒక భాగమైన RAM. ఒకప్పుడు చౌకైనదిగా భావించే RAM ధరలు ఇప్పుడు వేగంగా పెరుగుతున్నాయి. ఇది దాదాపు ప్రతి డిజిటల్ పరికరం ఖర్చులపై ప్రభావం చూపుతుంది.

RAM ధరలు అకస్మాత్తుగా ఎందుకు పెరిగాయి?

అక్టోబర్ 2025 నుంచి భారత్‌తో పాటు పలు దేశాలలో RAM ధరలు రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి. చాలా సందర్భాలలో, కంపెనీలకు మునుపటి కంటే 4 నుండి 5 రెట్లు ఎక్కువ ధరలు చెబుతున్నారు. ఈ పెరుగుదలకు ఒక్క కారణం అని చెప్పలేం. పలు అంశాల కారణంగా రామ్ అవసరమయ్యే అన్ని పరికరాల ధరలు పెరిగాయి. దీనికి అతిపెద్ద కారణం AI సాంకేతికత వేగంగా విస్తరించడం అని నిపుణులు చెబుతున్నారు.

AI, డేటా సెంటర్స్ సమతుల్యతను దెబ్బతీశాయి

నేడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని అమలు చేయడానికి పెద్ద డేటా కేంద్రాలు నిర్మిస్తున్నారు. ఈ డేటా సెంటర్స్ అధిక పనితీరు గల సర్వర్లు, ప్రత్యేక రకం మెమరీ, వేగవంతమైన టెక్నాలజీపై ఆధారపడి ఉంటాయి. ఇందులో RAM వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. AI వినియోగం పెరిగేకొద్దీ ప్రపచం వ్యాప్తంగా RAM డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. సమస్య ఏమిటంటే RAM సరఫరా ఆ వేగంతో పెరగలేదు. ఫలితంగా డిమాండ్, సరఫరా మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడి నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.

ఇవి చిన్న ఖర్చులు కాదు, పెద్దవి

బీబీసీ నివేదిక ప్రకారం, సాంకేతిక కంపెనీలు తరచుగా చిన్న ఖర్చులను భరిస్తాయి. దాంతో కస్టమర్‌లపై ఎటువంటి ప్రభావం ఉండదు. కానీ పెట్టుబడి చాలా పెరిగినప్పుడు, దాని భారం చివరికి కస్టమర్‌పై పడుతుంది. కంప్యూటర్లను తయారు చేసే అనేక కంపెనీలు ప్రస్తుత పరిస్థితుల్లో ధరలను పెంచకుండా ఉండటం దాదాపు అసాధ్యమని చెబుతున్నాయి. ఒక PC తయారీదారు ప్రకారం, ఇటీవల కొన్ని RAM భాగాల కోసం 500 శాతం వరకు ఎక్కువ ధరలను కోట్ చేశారు. కంపెనీలకు లాభాలను తగ్గించుకోవడం లేదా ఉత్పత్తుల ఖర్చు పెంచడం ఏదో ఒకటి చేయక తప్పదు. 

ప్రతి పరికరంపై ప్రభావం

RAM అనేది పరిమితమైనది కాదు. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, వైద్య పరికరాలు దాదాపు ప్రతి ఎలక్ట్రానిక్ పరికరంలోనూ ఉపయోగిస్తారు. మెమరీ ఖరీదైనదిగా మారితే, దాని ప్రభావం మొత్తం మార్కెట్‌పై కనిపిస్తుంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే స్టాక్‌ను సిద్ధం చేసుకున్నాయి. కానీ తక్కువ ఇన్వెంటరీ ఉన్న తయారీదారులు 4 నుండి 5 రెట్లు ధరలను పెంచారు.

2026 వరకు ద్రవ్యోల్బణం 

సాంకేతిక పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం RAM ధరలలో ఈ పెరుగుదల 2026 వరకు కొనసాగుతుంది. 2027 వరకు కూడా పరిస్థితులు సవాలుగా మారతాయి. AI కోసం ఉపయోగించే హై-ఎండ్ మెమరీ మొత్తం మార్కెట్‌ను ప్రభావితం చేసింది. దీంతో సాధారణ వినియోగదారులకు సైతం RAM ఖరీదైనదిగా మారింది. క్లౌడ్ సేవలను అందించే పెద్ద కంపెనీలు ఇప్పటికే 2026, 2027 అవసరాలను అంచనా వేశాయి. దీని వలన RAM తయారు చేసే కంపెనీలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుందని, సరఫరా పరిమితంగా ఉందని గుర్తించారు.

ఖర్చులను భరించలేకపోతున్న కంపెనీలు

ఒక సాధారణ ల్యాప్‌టాప్‌లో, RAM మొత్తం వ్యయంలో దాదాపు 15 నుండి 20 శాతం ఉంటుంది. ప్రస్తుత ధరలతో ఇది 30 నుండి 40 శాతం వరకు పెరిగింది. కనుక కంపెనీలు ఇంత పెద్ద వ్యయాన్ని భరించలేవు. కొంతమంది సరఫరాదారులు ధరల గురించి కోటేషన్ ఇవ్వడం  మానేశారు. ఇది రాబోయే రోజుల్లో మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని సూచిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు ఎంత ఖరీదు అవుతాయి

16GB RAM ఉన్న సాధారణ ల్యాప్‌టాప్ తయారీ ఖర్చు 2026లో 40 నుండి 50 డాలర్లు పెరగవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వస్తే, ఒక ఫోన్ ధర దాదాపు 30 డాలర్లు పెరగవచ్చు. దాంతో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు అదే స్థాయిలో పెరగనున్నాయి. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget