వయసు పెరిగే కొద్ది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల చర్మ సమస్యలు పెరుగుతాయి.

ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఓ సింపుల్​ డ్రింక్​తో స్కిన్ హెల్తీగా మారుతుందంటున్నారు.

గుమ్మడి గింజలు, కొబ్బరి, ఖర్జూరం, సన్​ఫ్లవర్ సీడ్స్​తో కలిపి చేసే డ్రింక్ స్కిన్​ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది.

ఈ డ్రింక్ చేయడానికి 1 టీస్పూన్ గుమ్మడి గింజలు, కొబ్బరి తురుము 1 టీస్పూన్, ఖర్జూరాలు 2 తీసుకోవాలి.

సన్​ఫ్లవర్ సీడ్స్ కూడా 1 టీస్పూన్ తీసుకోవాలి. వీటన్నింటిని కప్పు నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.

దీనిని రెగ్యూలర్​గా తాగుతూ ఉంటే స్కిన్​కి చాలా మంచిదని చెప్తున్నారు నిపుణులు.

గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజిన్​ని పెంచి ముడతలను తగ్గిస్తుంది.

కొబ్బరి తురుము హెల్తీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మంచి పోషణను అందిస్తుంది.

ఖర్జూరాల్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది డ్రింక్​కి సహజమైన రుచిని అందిస్తుంది.

సన్​ ఫ్లవర్ సీడ్స్​లో విటమిన్ ఈ, ఇది స్కిన్​ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. (Images Source : Envato)