Hari Hara Veera Mallu: వినాలి... వీరమల్లు మాట వినాలి - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి సర్‌ప్రైజ్, ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
Hari Hara Veeramallu First Song Promo: పవర్ స్టార్ పవన కళ్యాణ్ అభిమానుల సంక్రాంతి పండుగ సర్ప్రైజ్ ఇచ్చింది హరి హర వీరమల్లు టీం. ఈ మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇస్తూ ప్రొమో రిలీజ్ చేసింది.
Hari Hara Veera Mallu Update:సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త సినిమాల అప్డేట్స్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నాయి ఆయా చిత్ర బృందాలు. ఇప్పటికే ప్రభాస్ 'ది రాజా సాబ్', బాలయ్య 'అఖండ 2', రామ్ పోతినేతి 'రాపో' నుంచి కొత్త పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. దీంతో వారి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అలాగే పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' టీం ఓ అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. ఎంతోకాలంగా అభిమానులంత ఆయన సినిమాల అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎలాంటి అప్డేట్ అయినా ఇవ్వాలంటూ తరచూ సోషల్ మీడియా వేదికగా మూవీ టీంని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానుల కోసం 'హరి హర వీరమల్లు' టీం సరికొత్త అప్డేట్ తో వచ్చింది.
ఆ రోజే ఫుల్ సాంగ్
మాట వినాలి అంటూ ఫస్ట్ సాంగ్ సాంగ్ ప్రొమో రిలీజ్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన పాట కావడం విశేషం. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఇక జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా ఫస్ట్ సాంగ్ ప్రొమో రిలీజ్ చేస్తూ ఫుల్ సాంగ్ రిలీజ్ డేట్ టైం ప్రకటించారు. వినాలి అంటూ పవన్ చెప్పిన మాటతో ఈ ప్రోమో మొదలైంది. కేవలం 16 సెకన్ల నిడివితో విడుదలైన ఈ ప్రొమో లో వీరమల్లుగా పవన్ పాత్ర మ్యానరిజాన్ని పరిచయం చేశారు. చలి మంట, డబ్బు, ఆయన చేయి కడియం చూపిస్తూ ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు ఈ ప్రొమోని చూపించారు. ఈ పాట ప్రొమో ‘వినాలి.. వీరమల్లు మాట చెబితే వినాలి’ అనే డైలాగ్ తో ముగిసింది. ప్రస్తుతం ఈ ప్రొమోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ అప్డేట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ సందడి మరింత రెట్టింపు అయ్యింది. ఇక ఫుల్ సాంగ్ ను జనవరి 17న ఉదయం 10 గంటల 20 నిమిషాలకు రిలీజ్ చేస్తామని చిత్ర బృందం వెల్లడించింది. దీంతో ఫుల్ సాంగ్ అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పోరాట యోధుడు వీరమల్లు
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదల చిత్రమిది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ చివరి షెడ్యూల్ ని మొదలుపట్టినట్టు మూవీ టీం ప్రకటించింది. ఇది క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అని వెల్లడించింది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు సినిమాలో ముఖ్య తారాగణం కూడా పాల్గొననుందని తెలిపారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఇందులో పవన్ పోరాట యోధుడిగా కనిపించనున్నాడు. 18వ శతాబ్ధం కాలం బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం సాగనుంది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
Also Read: 'గేమ్ చేంజర్' బడ్జెట్, కలెక్షన్స్ మీద ఆర్జీవీ సెటైర్లు - ట్విట్టర్‌లో విరుచుకుపడిన వర్మ
దీనితో పాటు పవన్ చేతిలో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ మూడింటిలో ఓజీపైనే అందరి దృష్టి ఉంది. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ముంబై గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగనుంది. ప్రస్తుతం ఈ సినిమా 40 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. ఈ చిత్రం ద్వారా పవన్ తనయుడు అకిరా నందన్ వెండితెర ఎంట్రీ ఇవ్వనున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 20 శాతం షూటింగ్ ని మాత్రమే జరుపుకుంది. హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాల తర్వాత పవన్ ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నాడని టాక్.