అన్వేషించండి

Ram Gopal Varma: 'గేమ్ చేంజర్' బడ్జెట్, కలెక్షన్స్ మీద ఆర్జీవీ సెటైర్లు - ట్విట్టర్‌లో విరుచుకుపడిన వర్మ

గేమ్ చేంజర్ మీద రామ్ గోపాల్ వర్మ విరుచుకుపడ్డారు. కలెక్షన్లపై సెటైర్లు విసిరారు. అల్లు అర్జున్ కాళ్ళు మొక్కాలని అనిపించిందన్నారు. కొన్నాళ్లుగా సైలెన్స్ మెయింటైన్ చేసిన ఆర్జీవి మరోసారి ట్వీట్లు చేశారు.

మెగా ఫ్యామిలీ మీద ఛాన్స్ దొరికిన ప్రతిసారి సెటైర్లు వేసే వ్యక్తులలో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ముందు ఉంటారు.‌ ఏపీలో ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం మీద విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం, జనసేన పార్టీలతో పాటు లోకేష్, పవన్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సెటైరికల్ సినిమాలు తీశారు. వైసీపీ అండతో ఆయా సినిమాలు చేశారని విమర్శలు ఉన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కించపరిచే సోషల్ మీడియా పోస్టులకు దూరంగా ఉన్న వర్మ మరోసారి జూలు విదిలించి తన మార్క్ ట్వీట్లతో రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మీద విరుచుకుపడ్డారు. 

'గేమ్ చేంజర్' బడ్జెట్, కలెక్షన్స్ మీద వర్మ విమర్శలు!
'గేమ్ చేంజర్' పేరును తన ట్వీట్లలో రామ్ గోపాల్ వర్మ తీయలేదు. 'G C' అని చెప్పారు. అంటే... 'గేమ్ చేంజర్' అన్నమాట. ఆ సినిమా బడ్జెట్ 450 కోట్ల రూపాయలు అయితే... ఇంతకు ముందు ఎప్పుడూ ప్రేక్షకులు చూడనటువంటి ఎక్స్ట్రార్డినరీ విజువల్ అప్పీల్ ఉన్న 'త్రిబుల్ ఆర్' సినిమా బడ్జెట్ 4500 కోట్ల రూపాయలు అయ్యి ఉండాలని వర్మ పేర్కొన్నారు. అంతే కాదు... 'గేమ్ చేంజర్' మొదటి రోజు 186 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అయితే పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్లు 1860 కోట్ల రూపాయలు అయ్యి ఉండాలని ఆయన విమర్శలు గుప్పించారు. నిజం చెప్పినప్పుడు నమ్మేలా ఉండాలని 'గేమ్ చేంజర్' విషయానికి వస్తే అబద్ధం చెప్పినప్పుడు మరింత నమ్మశక్యంగా ఉండాలని వర్మ ట్వీట్ చేశారు.

Also Read: 'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?

రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు తెలుగు సినిమాను రియల్ కలెక్షన్లతో ఆకాశమంత ఎత్తుకు తీసుకు వెళ్లడంతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ అయ్యేలా చేస్తే... సౌత్ ఇండస్ట్రీ ఫ్రాడ్ చేయడంలో ఫెంటాస్టిక్ అంటూ చెప్పడంలో 'గేమ్ చేంజర్' వెనుక ఉన్న జనాలు సక్సెస్ అయ్యారని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. ఈ అబద్ధాలు చెబుతున్నది ఎవరో తనకు తెలియదని, 'దిల్' రాజు అయితే కాదని అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేయడం గమనార్హం. తనకు 'పుష్ప 2' సినిమా నచ్చిందని, అయితే 'గేమ్ చేంజర్' చూశాక అల్లు అర్జున్, సుకుమార్ కాళ్ళ మీద పడాలని అనిపించిందని వర్మ ముగించారు.

Also Readనవ్వించే ప్రయత్నమే... మా ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారు - అన్షుపై కామెంట్స్‌ & రేవంత్ రెడ్డి - బన్నీ ఇష్యూలో సారీ చెప్పిన త్రినాథరావు నక్కిన

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget