Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్ తెలుసుకోండి
Mana Shankara Vara Prasad Garu Trailer Launch Event: తిరుపతిలో మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ విడుదల కార్యక్రమం జరగనుంది. ఆ ఈవెంట్ డీటెయిల్స్ తెలుసుకోండి.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా రూపొందిన తాజా సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu). సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. ఇవాళ (జనవరి 4వ తేదీన) ట్రైలర్ విడుదల చేస్తున్నారు. ఈ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? ఇందులో ఎవరెవరు పాల్గొంటారు? ఎన్ని గంటలకు ట్రైలర్ విడుదల చేస్తారు? వంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.
తిరుపతిలో ట్రైలర్ లాంచ్...
ఈవెంట్ ఎక్కడ చేస్తున్నారంటే?
MSG Trailer Launch Event Place: తిరుపతిలో 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ విడుదల కార్యక్రమం ప్లాన్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి, చిత్ర నిర్మాతలలో ఒకరైన షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి శనివారం రాత్రి తిరుపతి చేరుకున్నారు. ఏడు కొండల వెంకటేశ్వర స్వామిని ఇవాళ తెల్లవారుజామున దర్శించుకుని ఆ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. తిరుపతిలోని ఎస్వీ సినీప్లెక్స్ థియేటర్‌లో ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈవెంట్ కోసం దర్శక నిర్మాతలు సహా కీలక తారలు కొందరు హాజరు కానున్నారు.
Also Read: అనిల్ రావిపూడికి షాక్ ఇచ్చిన నయనతార... కెమెరా కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోండమ్మా!
View this post on Instagram
ట్రైలర్ రిలీజ్ ఎన్నింటికి?
కార్యక్రమానికి వచ్చేది ఎవరెవరు?
MSG Trailer Launch Time: జనవరి 4, ఆదివారం సాయంత్రం 4.05 గంటలకు 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ విడుదల కానుంది. తిరుపతిలో ఈ ప్రోగ్రాంకి హీరో హీరోయిన్లు చిరంజీవి, నయనతార హాజరు కావడం లేదు. దర్శక నిర్మాతలతో పాటు లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి సహా మరికొందరు హాజరు కానున్నారు. ఈ ఈవెంట్ వరకు చీఫ్ గెస్ట్ అనిల్ రావిపూడి అని చెప్పాలి. ట్రైలర్ కాకుండా ఆయన స్పీచ్ మెయిన్ హైలైట్ కానుంది.
View this post on Instagram
జనవరి 12న విడుదల కానున్న 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడు. 'మీసాల పిల్లా', 'శశిరేఖ', 'మెగా విక్టరీ మాస్'... మూడు పాటలు విడుదల చేశారు. మిగతా పాటలు త్వరలో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో కేథరిన్ త్రేసా, అభినవ్ గోమఠం, మురళీధర్ గౌడ్ సహా పలువురు నటించారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు. సంక్రాంతి బరిలో అన్ని సినిమాల కంటే ముందు విడుదల అయ్యే చిత్రమిది.





















