Ram Charan: ఇదీ రామ్ చరణ్ గోల్డెన్ హార్ట్... అభిమాని భార్యకు 17 రోజుల పాటు హాస్పిటల్‌లో వీఐపీ ట్రీట్మెంట్
Unstoppable 4: అన్ స్టాపబుల్ సీజన్ 4 లేటెస్ట్ ఎపిసోడ్ లో ఓ మెగా అభిమాని రామ్ చరణ్ తనకు చేసిన సాయాన్ని వెల్లడిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు.

టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలు ఫేమ్ లో అందనంత ఎత్తుకు ఎదగడమే కాదు, వ్యక్తిత్వం పరంగా కూడా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. ఆయన చేసే సాయం ఎవ్వరికీ రీసెంట్ గా శర్వానంద్ చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి ఓ అభిమాని తన భార్యకు ఆరోగ్యం బాలేనప్పుడు హాస్పిటల్ ద్వారా రామ్ చరణ్ చేసిన సాయాన్ని గుర్తు తెచ్చుకొని కన్నీటి పర్యంతమయ్యారు.
17 రోజులు వీఐపీ ట్రీట్మెంట్
రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి వారసుడు, పాన్ ఇండియా స్టార్ అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆయన చేసే సాయం, మంచి మనసు గురించి మాత్రం ఇంకా చాలా మందిక తెలియదనే చెప్పాలి. మెగా అభిమానులు తరచుగా రామ్ చరణ్ ది గోల్డెన్ హార్ట్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. అయితే చెర్రీ మాత్రం ఎప్పుడూ తాను చేసే సాయం గురించి బయట మాట్లాడరు. తాజాగా ఆహా టీం రామ్ చరణ్ చేసే సాయం గురించి, ఆయన గొప్ప మనసు గురించి అందరికీ తెలిసేలా చేసింది.
ఆహాలో రామ్ చరణ్ పాల్గొన్న లేటెస్ట్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేశారు. అందులో భాగంగా ఓ వ్యక్తి స్టేజ్ పైకి వచ్చి రామ్ చరణ్ తనకు చేసిన సాయం గురించి చెబుతూ అందరిని ఎమోషనల్ అయ్యేలా చేశారు. సదరు మెగా అభిమాని బ్లడ్ బ్యాంకులో ప్రతి ఏడాది మూడు నాలుగు సార్లు రక్తదానం చేస్తాడని తెలుస్తోంది. అలాంటి అభిమానికి కష్టం వచ్చిందని తెలుసుకున్న రామ్ చరణ్ అతని ఇంటికి అంబులెన్స్ పంపించి, ఫ్రీగా వీఐపీ ట్రీట్మెంట్ అందించే ఏర్పాటు చేశారట. 'అన్ స్టాపబుల్' షోలో సదరు అభిమాని మాట్లాడుతూ "ఆ టైంలో నా భార్య పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. అలాంటి టైంలో నాకేం చేయాలో పాలుపోలేదు. పైగా భయమేసింది. ఆ టైంలో రామ్ చరణ్ గారు విషయం తెలుసుకొని వెంటనే అంబులెన్స్ పంపించడం, అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. రిసెప్షన్లో పేరు చెప్పగానే ఓ వీఐపీ రేంజ్ లో ట్రీట్ చేశారు. మరోవైపు నాకేమో బిల్ గురించి భయమేస్తోంది. ఎంత కట్టమంటారో? లేదా మా పరిస్థితి తగ్గట్టుగా వేరే హాస్పిటల్ చూసుకోవాలా? అని టెన్షన్ పడుతున్నాను. కానీ వాళ్లు మాత్రం ఏమీ కట్టక్కర్లేదు పైనుంచి ఫోన్ వచ్చిందని చెప్తున్నారు. 17 రోజులపాటు ప్రతిరోజూ ఒక స్పెషలిస్ట్ డాక్టర్ రావడం, ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నా భార్య కోలుకుంది. నా భార్యకి మొత్తానికి ప్రాణం పోసి అప్పచెప్పారు. ఇదంతా రామ్ చరణ్, ఉపాసన గారు మాట్లాడుకుని చేస్తున్నారు అని చెప్పారు" అంటూ అభిమాని కన్నీరు మున్నీరయ్యారు.
Also Read: ఒక్కడినే వస్తా, నువ్వు ఎవరితో వస్తావో రా... అన్నయ్య విష్ణుకు మంచు మనోజ్ సవాల్
I Stan the Right person #RamCharan 🙏🏻🛐
— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) January 17, 2025
Pure Golden Hearts @AlwaysRamCharan @upasanakonidela 🙏🏻🥹😭❤️ pic.twitter.com/OXad0ZzPN5
అభిమానుల్ని అతిథుల్లా...
అంతకుముందు శర్వానంద్ కూడా రామ్ చరణ్ గురించి ఇలాంటి కామెంట్స్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 'అన్ స్టాపబుల్ షోలో రామ్ చరణ్ ఫ్రెండ్, టాలీవుడ్ హీరో శర్వానంద్... రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ తనకు చేసిన సాయం గురించి వెల్లడించారు. అంతేకాకుండా రామ్ చరణ్ చేసే సాయం చివరకు పొందిన వాడికి, అందిన వాడికి కూడా తెలియదు అంటూ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా, చెర్రీ అభిమానులు ఇదిరా రామ్ చరణ్ గోల్డెన్ హార్ట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు రీసెంట్ గా 'గేమ్ ఛేంజర్' రిలీజ్ సందర్భంగా రామ్ చరణ్ తనను చూడడానికి ఇంటికి వచ్చిన అభిమానులకు కడుపు నిండా ఫుడ్ పెట్టి, తన మంచి మనసును చాటుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

