Ugadi Rasi Phalalu 2025: ఉగాది పంచాంగం ఏప్రిల్ 2025 to 2026 మార్చి - మీన రాశి వారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలుంటాయి!
Ugadi Rasi Phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకూ నెలవారీ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..

Ugadi Yearly Rasi Phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశివారి నెలవారీ ఫలితాలు
మీన రాశి ( పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి )
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 3 అవమానం : 1
ఏప్రిల్ 2025
ఈ నెల ఆరంభంలో ఇబ్బందులు, శారీరకశ్రమ, అలసట ఉంటుంది. బంధుమిత్రవిరోధాలుంటాయి. అనవసరంగామాటలుపడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి.వాహన ప్రమాద సూచనలున్నాయి. ద్వితీయార్ధంకొంతమేర బాగుంటుంది.
మే 2025
ఈ నెలలో మీన రాశికి చెందిన అన్నిరంగాలవారికి అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్యం, ఆదాయం బావుంటుంది. ఆనందంగా ఉంటారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం కారమంగా సంతోషంగా ఉంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి.
జూన్ 2025
ఈ నెలలో మీ మాటకు తిరుగులేదు. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేస్తారు. వ్యాపారం, వ్యవహారం, ఉద్యోగం అన్నింటా విజయం మీదే. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. మీ పనుల కన్నా ఇతరుల వ్యవహారాలకోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు
ఆగష్టు 2025
ఈ నెలలో చికాకులు తప్పవు. మీ మాటకు గుర్తింపు ఉండదు. ఆర్థిక లావాదేవీల్లో చిక్కులుంటాయి. మనోధైర్యం కోల్పోతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటారు మాతృవర్గసూతములు ఉండొచ్చు.
సెప్టెంబర్ 2025
కుజుడి సంచారం ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. మనోధైర్యం కోల్పోతారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చికాకు కలిగించే సంఘటనలు జరుగుతాయి. చేపట్టిన పనులు ఆగిపోతాయి. సంతానం కారణంగా సమస్యలుంటాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి.
అక్టోబర్ 2025
ఈ నెలలో ఉద్రేకంగా వ్యవహరిస్తారు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. చికాకు కలిగించే సంఘటనలు జరుగుతాయి. వాహనప్రమాద సూచనలున్నాయి. బంధుమిత్రులతో విరోధాలుంటాయి. శత్రుభయం వెంటాడుతుంది. డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది.
నవంబర్ 2025
మీన రాశివారికి నవంబర్ ఆరంభంలో అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు చేయాల్సిన పరిస్థితిలు ఎదురవుతాయి. మాట్లాడితే విరోధం అన్నట్టుంటుంది. పరమార్శలు చేయాల్సి వస్తుంది. చికాకులు ఆందోళనలు ఉంటాయి.
డిశంబర్ 2025
ఈ నెల గ్రహసంచారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఉద్యోగం మారాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఇంట్లో సమస్యలు తీరిపోతాయి. వాహనయోగం ఉంది. నమ్మినవారివల్ల లాభపడతారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి.
జనవరి 2026
ఆంగ్ల నూతన సంవత్సరం ఆరంభం మిశ్రమంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంద. చీటికి మాటికి ఆందోళన చెందుతారు. కోపంగా ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు.
ఫిబ్రవరి 2026
ఈనెలలో అన్నిరంగాలవారికి అనుకూలమే. చేయువృత్తివ్యాపారాలు లాభం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. భార్యతో సఖ్యత ఉంటుంది. దైవదర్శనాలు చేస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
మార్చి 2026
ఈ నెలలో వ్యాపారం, ఉద్యోగంలో అనుకూల ఫలితాలుంటాయి కానీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం కష్టమే. డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలకు వెచ్చించాల్సి వస్తుంది. విద్యార్ధులు పరీక్షలు ఆశించినంత మేరవ్రాయలేరు.
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
( కన్యారాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

