Hari Hara Veera Mallu: ధర్మం కోసం పోరాడే యోధుడు వచ్చేస్తున్నాడు - 'హరిహర వీరమల్లు' నుంచి పవన్ కల్యాణ్ కొత్త లుక్
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అవెయిటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'. ఉగాది సందర్భంగా ఈ మూవీ నుంచి పవన్ కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా

Pawan Kalyan's New Look From Hari Hara Veera Mallu New Look Unveiled: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). మే 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉగాది సందర్భంగా పవన్ కొత్త లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌లో పవన్ ఓ చేతిలో కత్తి, మరో చేతిలో కడియం పట్టుకుని దర్శనమిచ్చారు. రెడ్ కలర్ షర్ట్, లుంగీ, మెడలో బ్లాక్ కలర్ తువాలుతో ఓ యుద్ధ వీరుడిలా కనిపించారు. ఈ లుక్ అదిరిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'ధైర్య సాహసాల గాథ, ధర్మం కోసం పోరాటం, ఉన్నతంగా నిలిచే యోధుడు. హరిహర వీరమల్లు గాథను గొప్పతనంతో ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉండండి.' అని ట్వీట్ చేశారు.
A tale of bravery, a battle for dharma, and a warrior who stands tall! ⚔️🔥
— Hari Hara Veera Mallu (@HHVMFilm) March 30, 2025
Get ready to witness the saga of #HariHaraVeeraMallu unfold in all its grandeur. 💥💥#ఉగాదిశుభాకాంక్షలు - #HappyUgadi - #HappyGudiPadwa from Team #HHVM
Storming in cinemas 9th May, 2025. pic.twitter.com/ineuaysCHV
డబ్బింగ్ పనులు షురూ..
పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయంటూ ఇటీవలే మూవీ టీం ఓ పోస్టర్‌ను సైతం సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
ఈ మూవీని నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. తొలుత మార్చి 28న మూవీ రిలీజ్ చేస్తామని ప్రకటించినా .. అనివార్య కారణాలతో విడుదల వాయిదా పడింది. మే 9న మూవీ రిలీజ్ చేస్తామని.. 'మార్క్ ద డేట్' అంటూ టీం తెలిపింది.
రెండు భాగాలుగా..
'హరిహర వీరమల్లు' మూవీ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌ను 'స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ను సగానికి పైగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోగా.. మిగిలిన భాగంతో పాటు సెకండ్ పార్ట్‌ను నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం తెరకెక్కిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ ప్రజా పాలనలో బిజీగా మారగా.. ఆయన పదవి చేపట్టిన తర్వాత రిలీజ్ అయ్యే ఫస్ట్ సినిమా ఇదే కానుంది.






















