Ippala Ravindra Reddy: లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
YSRCP Social Media: మంత్రి నారా లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఉండటం టీడీపీలో కలకలకానికి కారణం అయింది. గతంలో ఘోరమైన పోస్టులు పెట్టి అరెస్టు అయిన వ్యక్తి.

Ippala Ravindra Reddy Issue: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ సిస్కో ఏపీ ప్రభుత్వంలో కొన్ని ఒప్పందాలు చేసుకుంది. ఇందు కోసం సిస్కో ప్రతినిధి బృందం నారా లోకేష్ ను కలిశారు. ఆ టీమ్ సంతకాలు పూర్తయిన తర్వాత వీడియోలు మీడియాకు వచ్చాయి. అయితే కాసేపటికే టీడీపీ సోషల్ మీడియా ఒక్క సారిగా భగ్గు మంది. ఎందుకంటే సిస్కో టీమ్ ఇప్పాల రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. దీంతో ఇప్పాలను ఎలా రానిచ్చారంటూ టీడీపీ సోషల్ మీడియా ప్రశ్నించడం ప్రారంభించింది.
ఇప్పాల రవీంద్రారెడ్డి గతంలో సోషల్ మీడియాలో ఘోరమైన పోస్టులతో అరాచకం చేశారు. 2017లో విశాఖ పోలీసులు ఆయనను అరెస్టు కూడా చేశారు. మీడియా ముందు ప్రవేశ పెట్టారు. అయితే ఇటీవలి కాలంలో కనిపించడం పెద్దగా పోస్టులు పెట్టడం లేదు. దాంతో అందరూ మర్చిపోయారు. అయితే హఠాత్తుగా ఆయన లోకేష్ తో సిస్కో టీమ్‌తో కలిసి వచ్చి సమావేశం కావడం ఆశ్చర్యంగా మారింది.
ఇప్పాల రవీంద్రా రెడ్డిని కలిసిన లోకేష్ గారు!!
— BheemBoy💕🇮🇳 Eat millets Stay Healthy🙏 (@PITCHBOSS) March 25, 2025
కుటుంబ సభ్యుల మీద బూతు రాతలు రాసి బూతు ప్రచారాలు చేసినా క్షమించి కలవటం ....
న భూతో న భవిషత్
కందకి లేని దురద కత్తి పీటకి ఎందుకులే!! @OfficeofNL pic.twitter.com/bKDnDsQpV6
సిస్కోలో ఒప్పందాలపై సంతకాలు పూర్తయ్యాక.. వీడియోలు బయటకు వచ్చిన తర్వాత గగ్గోలు రేగింది. లోకేష్ తో ఇప్పాల రవీంద్రారెడ్డి భేటీ అయ్యారని అలా ఎలా అంగీకరించారని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తాయి. దాంతో లోకేష్ టీం వెంటనే క్రాస్ చెక్ చేసుకుంది. సిస్కో బృందంలో వచ్చిన వ్యక్తుల పేర్లను చూసింది. ఐ.రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఉన్నారు. దీంతో అతనే ఇప్పాల రవీందారెడ్డి అనే క్లారిటీకి వచ్చారు. ఓ చీప్ ..సోషల్ మీడియా పోస్టులు పెట్టే వ్యక్తి సిస్కోలో ఉన్నత స్థానంలో ఉంటాడని ఎవరూ ఊహించలేకపోయారు. ప్రస్తుతం సిస్కోలో టెరిటరీ సేల్స్ మేనేజర్, పబ్లిక్ సెక్టార్ బిజినెస్ విభాగాన్ని చూస్తున్నారు. లోకేష్ తో సమావేశాన్ని ఆయనే కోఆర్డినేట్ చేశారు.
ఈ విషయం తెలియడంతో వెంటనే సిస్కో యాజమాన్యానికి లోకేష్ ఓఎస్డీ లేఖ రాశారు. ఇప్పాల రవీంద్రారెడ్డి సోషల్ మీడియా రికార్డుతో పాటు అతనిపై నమోదైన కేసుల వివరాలును కూడా పంపారు. ఇంకెప్పుడు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలను చర్చించేందుకు ఆ వ్యక్తిని తీసుకు రావొద్దని స్పష్టం చేశారు. ఆయనను ఏపీకి సంబంధిచిన ఎలాంటి వ్యవహారాల్లోనూ ఇన్వాల్వ్ చేయవద్దన్నారు.
సిస్కో ఇండియా టెరిటరీ ఎకౌంట్ మేనేజర్ (వైసీపీ సోషల్ మీడియా తరపున తెలుగుదేశం నాయకులపై బూతులతో పోస్టులు వేసిన) ఇప్పాల రవీంద్ర రెడ్డి ని ఏపీ కి చెందిన ఏ ప్రాజెక్ట్స్ లో అయినా ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఇన్వాల్వ్ చేయవద్దు అని సిస్కో కు లేఖ రాసిన నారా లోకేష్ గారి కార్యాలయం pic.twitter.com/gJ2ouK8wzY
— D S G RAJU #YuvaGalam #iTDP (@DSGRAJU1) March 25, 2025
ఇప్పాల రవీంద్రారెడ్డి ఇప్పుడు పోస్టులు పెట్టడం లేదు కానీ...గతంలో ఆయన పెట్టిన పోస్టుల వల్ల ఆయన జీవితం మాత్రం ఇక రిస్కులో పడిపోయింది. ఆయన ఉద్యోగం కొనసాగింపుపై సిస్కో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి ఘోరమైన సోషల్ మీడియా రికార్డు ఉన్న వారిని కార్పొరేట్ సంస్థలు అంగీకరించబోవని హెచ్ఆర్ నిపుణులు చెబుతున్నారు.తనపై నమోదైన కేసుల గురించి దాచి పెట్టి ఆయన ఉద్యోగంలో చేరి ఉంటారని భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

