Razole Latest News: టీడీపీలోకి రాపాక! రాజోలులో లైన్ క్లియర్ అయినట్టేనా?
Razole Latest News: జనసేన పార్టీకి తొలి ఎమ్మెల్యేగా గెలిచి గుర్తింపు పొందిన రాపాక వర ప్రసాదరావు దారెటు..? వరుసగా టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్న రాపాకకు లైన్ క్లియర్ అవుతుందా..?

Razole Latest News: జనసేన పార్టీ తొలి ఎమ్మెల్యేగా నెగ్గి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా గుర్తింపు పొందిన రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రస్తుతం దారెటు..? ఆయన ఏ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు కోనసీమలో ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన కదలికలు గమనిస్తున్న పలువురు ఆయన టీడీపీ నాయకులతో టచ్‌లో ఉన్నారననే టాక్ ఆసక్తిగా మారింది. రాజోలు నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకుడు లేకపోవడం ఈ ప్రచారనికి మరో కారణంగా కనిపిస్తోంది. రాజోలులో వ్యక్తిగత ఓటు బ్యాంకు కలిగిన నాయకునిగా గుర్తింపు ఉన్న రాపాక వరప్రసాదరావుకు ఇప్పుడు ఇదే అంశం కలిసొచ్చే అవకాశాలున్నాయని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది.
టికెట్టు ఇవ్వలేదనే వైసీపీకీ గుడ్‌బై చెప్పారా..?
రాజోలు నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న గొల్లపల్లి సూర్యారావు మొన్నటి సాధారణ ఎన్నికలకు ముందు టీడీపీకి షాకు ఇచ్చి వైసీపీలో చేరి టిక్కెట్టు దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన పార్టీకి ఏకైన ఎమ్మెల్యేగా గెలుపొందిన రాపాక జనసేనకు షాక్ ఇచ్చి వైసీపీలో గూటికి చేరారు. 2024లో వైసీపీ టికెట్టు తనదే అనుకున్న సమయంలో ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన గొల్లపల్లికి అసెంబ్లీ టికెట్టు ఇచ్చి రాపాకకు వైసీపీ షాక్ ఇచ్చింది. అయితే అమలాపురం ఎంపీ టికెట్టు ఇచ్చినా అయిష్టతతోనే ఆయన పోటీలో ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎన్నికల అనంతరం ఆయన జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వైసీపీకు గుడ్‌బై చెప్పారు. గొల్లపల్లి వైసీపీకి వెళ్లిపోవడంతో అప్పటి నుంచి రాజోలులో టీడీపీకి నాయకుడు లేడు. ఇప్పుడు రాపాక చూపులు టీడీపీ వైపు పడటం వెనుక కారణమిదే అంటున్నారు. రాజోలులో టీడీపీకి ఇంచార్జ్ లేకపోవడం రాపాకకు కలిసొచ్చే అంశమని, రాపాక రాకకు మార్గం సుగమం అవుతుందంటున్నారు.
టీడీపీ నేతలను కలుస్తున్న రాపాక..?
మొన్నటి సాధరణ ఎన్నికల తరువాత వైసీపీకి గుడ్‌బై చెప్పిన రాపాక వరప్రసాదరావు టీడీపీ కీలక నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు తదితరులను కలిసినట్లు టాక్. ప్రస్తుతం రాపాక ఎటూ వెళ్లక సైలెంట్‌గా ఉన్నా కూడా ఆయన మాత్రం టీడీపీలోకి చేరేందుకు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారని మాత్రం స్థానికంగా తీవ్రంగా చర్చజరుగుతోంది..
టీడీపీలోకి రాపాక రాకను జనసేన ఓకే చెబుతుందా లేకుంటే వ్యతిరేకిస్తుందా అనేది మాత్రం క్లారిటీ లేదు. గెలిచిన వ్యక్తికి సరైన ప్రాధాన్యత ఇస్తే వెళ్లిపోవడంతో ఆయనపై జనసేన చాలా కోపంతో ఉంది. ఇప్పుడు అలాంటి వ్యక్తిని టీడీపీలోకి చేరనిస్తారా అనేది తేలాల్సిన అంశం. కూటమి పార్టీల్లో నాయకుల చేరికలు పరస్పర అంగీకారంతోనే సాగుతున్నాయనే టాక్ ఒకటి ఉంది. అందుకే చాలా మంది వైసీపీ నేతలు వివిధ పార్టీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటి మిత్ర పక్షాల నుంచి గ్రీన్ సిగ్నల్ లేకపోవడం ఒక కారణ. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు రెండో కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడు రాపాక విషయంలో ఏం జరుగుతుందో చూడాలి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

