అన్వేషించండి

KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్

KTR: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖ రాశారు. రేవంత్ అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ చేయించాలని కోరారు.

KTR demands CBI inquiry into Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బినామీ కంపెనీలకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపిస్తూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఘాటైన లేఖ రాశారు. ముఖ్యంగా  KLSR ఇన్‌ఫ్రాటెక్ అనే కంపెనీ ముఖ్యమంత్రికి బినామీ సంస్థ అని, అది దివాలా తీసిన స్థితిలో ఉన్నప్పటికీ సుమారు  రూ. 2,500 కోట్ల  విలువైన భారీ కాంట్రాక్టులను దానికి అప్పగించారని కేటీఆర్ ఆరోపించారు. సాగునీరు, తాగునీరు, యంగ్ ఇండియా స్కూల్స్ , రోడ్డు నిర్మాణ పనుల్లో ఈ అక్రమాలు జరిగాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.

కేఎల్ఎస్ఆర్ కంపెనీ రేవంత్ రెడ్డి బినామీ - కేటీఆర్             

ముఖ్యమంత్రి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని KLSR కంపెనీపై ఉన్న కేసుల సాక్ష్యాధారాలను మాయం చేయిస్తున్నారని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సేకరించిన సాక్ష్యాధారాలు పోయాయని ప్రభుత్వ అధికారులు కోర్టులో చెప్పడం దారుణమని, ఇది అధికారులపై ముఖ్యమంత్రి చేస్తున్న ఒత్తిడికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్ర విచారణ సంస్థలు, పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందని, విచారణ సజావుగా సాగకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు.    

ఎన్సీఎల్టీ విచారణలోనూ జోక్యం చేసుకున్నారు - కేటీఆర్            

నేషనల్ లా ట్రిబ్యునల్  విచారణలో కూడా రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారని, ఇప్పటికే ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చాలని సుప్రీంకోర్టు సూచించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు. నిష్పాక్షిక విచారణ జరగాలంటే కేంద్ర సంస్థలైన  సీబీఐ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  ,  సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్  రంగంలోకి దిగాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం ఆర్థిక అక్రమాలే కాకుండా, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న తీరుపై సమగ్ర దర్యాప్తు అవసరమని కోరారు.                   

ఇతర కేంద్ర మంత్రులకూ లేఖల కాపీలు పంపిన కేటీఆర్               

అమిత్ షాతో పాటు ఈ లేఖ ప్రతులను కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, పీయూష్ గోయల్, మరియు అర్జున్ రామ్ మేఘ్వాల్‌లకు కూడా కేటీఆర్ పంపించారు. బినామీ కంపెనీల ద్వారా రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తున్నారని, కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి వర్సెస్ కేటీఆర్ పోరును జాతీయ స్థాయికి తీసుకెళ్లినట్లయింది.               

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget