అన్వేషించండి

Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!

Telangana RTC Protest:ఆర్టీసీ ఈవీ బస్‌ల నిర్వహణపై జేఏసీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలక్ట్రిక్‌ బస్‌లను ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా, ఆర్టీసీ ద్వారానే నడపాలని, సంస్థ ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆర్టీసీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సమ్మెకు సిద్ధం.
  • 31 డిమాండ్లతో ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నోటీసు ఇచ్చింది.
  • ప్రభుత్వంలో విలీనం, ప్రభుత్వ ఉద్యోగుల హోదా కోరుతున్నారు.
  • బకాయిలు చెల్లించాలి, ఈవీ బస్సులను ఆర్టీసీనే నడపాలి.

Telangana RTC Protest : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిబ్బంది ఆందోళన బాట పట్టనున్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. మార్చి 13న డెడ్‌లైన్ విధించినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో శుక్రవారం ఆర్టీసీ యాజమాన్యానికి జాయింట్ యాక్షన్ కమిటీ అధికారికంగా సమ్మె నోటీసును అందజేసింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. 

సమ్మెకు దారి తీసిన పరిస్థితులు

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై గత నెలలోనే ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. మార్చి 13లోగా పరిష్కారం లభించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని, ఆపై సమ్మెకు దిగుతామని స్పష్టం చేశాయి. అయితే ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో కదలిక లేకపోవడంతో ఆర్టీసీ ఎండీ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు, అలాగే కార్మిక శాఖ కమిషనర్‌కు నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు. చట్టప్రకారం 14 రోజుల నోటీసు పిరియడ్‌ తర్వాత అంటే మార్చి 26 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్‌లు నిలిపివేసి సమ్మె ప్రారంభించనున్నట్టు జేఏసీ స్పష్టం చేసింది. 

ప్రధానంగా వినిపిస్తున్న 31 డిమాండ్లు 

ఆర్టీసీ జేఏసీ  నేతృత్వంలో మొత్తం 31 డిమాండ్లతో కూడిన నివేదికను యాజమాన్యానికి సమర్పించారు. ఇందులో ఆర్థికపరమైన అంశాలతోపాటు సంస్థ మనుగడకు సంబంధించిన కీలక డిమాండ్లు ఉన్నాయి. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసి, పని చేస్తున్న ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించాలని ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2017 నాటి వేతన సవరణను అమలు  చేసినప్పటికీ , దానికి సంబంధించిన ఎరియర్స్‌ను ఇంకా చెల్లించలేదు. సుమారు 2,150 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కార్మికులు కోరుతున్నారు. 2021 నాటి వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో తక్షణమే ప్రకటించి, అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. నెలకు 350 కోట్ల చొప్పున ఎటువంటి మినహాయింపులు లేకుండా ఆర్టీసీకి చెల్లించాలని వారు కోరుతున్నారు. గత ప్రభుత్వం నుంచి రావాల్సిన 2500 కోట్ల పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంస్థను కాపాడుకోవడంలో భాగంగా ఈవీ బస్‌ల నిర్వహణపై జేఏసీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలక్ట్రిక్‌ బస్‌లను ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా, ఆర్టీసీ ద్వారానే నడపాలని, తద్వారా సంస్థ ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించింది. 

పనిభారం తగ్గించాలని డిమాండ్ 

మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీని వల్ల కండక్టర్లు, డ్రైవర్లపై పని భారం అధికమైందని, దీనిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. మరోవైపు ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి, తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల కార్మికులకు తమ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక ప్రజాస్వామ్య వేదిక లభిస్తుందని వారు భావిస్తున్నారు.                     
 

Frequently Asked Questions

ఆర్టీసీ సిబ్బంది ఎందుకు ఆందోళన చేస్తున్నారు?

సుదీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు దిగారు.

సమ్మె ఎప్పుడు ప్రారంభమవుతుంది?

చట్టప్రకారం 14 రోజుల నోటీసు పిరియడ్​ తర్వాత, అంటే మార్చి 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిపివేసి సమ్మె ప్రారంభించనున్నారు.

కార్మికుల ప్రధాన డిమాండ్లు ఏమిటి?

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించడం, బకాయిలు చెల్లించడం, 2021 వేతన సవరణ అమలు చేయడం వారి ప్రధాన డిమాండ్లు.

మహాలక్ష్మి పథకం ఆర్టీసీపై ఎలాంటి ప్రభావం చూపుతోంది?

మహాలక్ష్మి పథకం వల్ల బస్సుల్లో రద్దీ పెరిగి, కండక్టర్లు, డ్రైవర్లపై పని భారం పెరిగింది. అలాగే, పథకం కింద రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget