Telangana Latest News: తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana Latest News: నీట్ ఆందోళనలు ఉద్ధృతమవుతున్న టైంలో ఓ తెలంగాణ యువకుడు ఆత్మహత్య చేసుకొని రాసిన లేఖ సంచలనంగా మారుతోంది. అందులో ఆ కుర్రాడు మోదీ పేరు రాయడంతో లెటర్ వైరల్ అవుతోంది.

Telangana Latest News: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కుర్రాడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను సర్ ఫామ్‌పై రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారుతోంది. అందులో మోదీ పేరు రాసి చనిపోవడంతో ఆ లేఖ వైరల్ అవుతోంది.
రాచర్ల గొల్లపల్లికి చెందిన వంశీ అనే కుర్రాడు బుధవారం రాత్రి సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకోవడానికి ముందు తన చావుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కారణం అంటూ రాసుకున్నాడు. ఇదే తన చావు లేఖ అంటూ సర్ ఫామ్‌లోనే వాంగ్మూలం ఇచ్చాడు. సర్ ఫామ్‌పై ఇంకా ఏం రాశాడంటే" ఇది నా చావు లేఖ. గౌరవనీయులైన పోలీసు వారికి నమస్కారాలు. తమరు నా ఆందోళన అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నా పేరు వంశీ, నేను చనిపోవడానికి కారణం పీఎం నరేంద్ర మోదీ. అంతే కానీ నా చావుకు నా ఫ్యామిలీ మాత్రం కారణం కాదు. దయచేసి ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా, నా దహనసంస్కారాలు ఆనవాయితీగా జరిపించాలని పోలీసు వారికి కోరుకుంటున్నాను." అని రాశాడు. చివరిలో ఇట్లు భారతీయ పౌరుడు వంశీ రాయల్ అని సంతకం చేశాడు. తర్వాత జైహింద్ అని నినాదం చేసి కింద థాంక్యూ ఫర్ గవర్నమెంట్ అని రాశాడు.
ట్రెండింగ్ వార్తలు





















