అన్వేషించండి

Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీతోపాటు విద్యావ్యవస్థలో జరుగుతున్న అవకతవకలపై తెలంగాణలోని విద్యార్థి సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. శుక్రవారం తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నీట్ లీకేజీ, విద్యా వ్యవస్థ వైఫల్యాలపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం.
  • కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రధాన డిమాండ్.
  • ఎన్.టి.ఎ రద్దు, విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు నిరసన.
  • జూలై 24న రాష్ట్ర విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు.

Telangana Schools Bandh On Friday: విద్యావ్యవస్థను నాశనం చేసేలా కేంద్రం చర్యలు ఉన్నాయని తెలంగాణలోని విద్యార్థి లోకం కూడా గళమెత్తింది. అందులో భాగంగానే నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజీ ఇతర అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనంతటికీ కారణమైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారంతా డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో తెలంగాణలో విద్యాసంస్థలకు ఎల్లుండి బంద్ కాల్ ఇచ్చారు. 

జులై 24న తెలంగాణలోని విద్యాసంస్థలన్నీ బంద్ చేసి విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఇందులో SFI, AISF, NSUI, PSDU, AIFDS సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రారంభించాయి. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. 

విద్యావ్యవస్థను నాశనం చేసిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వారు మొదటి డిమాండ్‌గా చెప్పారు. తర్వాత పరీక్షలు సరిగా నిర్వహించకుండా ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన NTAను రద్దు చేయాలి. విద్యావ్యవస్థను నాశనం చేసే వికాస్‌ భారత్‌ శిక్షా అధిష్ఠాన్ బిల్లును వెనక్కి తీసుకోవాలి. నీట్‌ ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన వారిపై చర్యలకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనలో లాఠీఛార్జ్ చేసిన వారిపై చర్యలకు డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులు కూడా వెనక్కి తీసుకోవాలని నినదించారు. 

ఈ డిమాండ్‌ల నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేథావులు సహకరించాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా శుక్రవారం జరిగే విద్యాసంస్థల బంద్‌కు సహకరించాలని అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చి నాటి నుంచి ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందని ఆరోపించారు. అడిగే వారిపై దమనకాండకు దిగుతున్నారని అన్నారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహించాలని నిలదీశారు.  

ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు అన్నీ కూడా బంద్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. 

Frequently Asked Questions

తెలంగాణలో విద్యాసంస్థల బంద్ ఎప్పుడు?

నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి నిరసనగా జులై 24న తెలంగాణలోని విద్యాసంస్థలకు బంద్‌కు పిలుపునిచ్చారు. ఇది శుక్రవారం జరగనుంది.

విద్యాసంస్థల బంద్‌కు ప్రధాన కారణం ఏమిటి?

నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, ఇతర అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నారని నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు.

విద్యాసంస్థల బంద్‌కు ఎవరు పిలుపునిచ్చారు?

తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. SFI, AISF, NSUI, PSDU, AIFDS వంటి సంఘాలు ఇందులో పాల్గొంటున్నాయి.

విద్యార్థి సంఘాల ప్రధాన డిమాండ్లు ఏమిటి?

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, NTAను రద్దు చేయాలని వారి ప్రధాన డిమాండ్లు. వికాస్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లును వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
TIMS Sanathnagar Hospital Inauguration:హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్‌ ప్రారంభం!
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్‌ ప్రారంభం!
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Embed widget