Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
టీమిండియా యంగ్ బ్యాట్స్మన్ వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో జరగబోయే టీ20 సిరీస్‌కు సిద్ధమయ్యాడు. గత నాలుగు నెలలుగా తన కెరీర్‌లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసిన చూసినప్పటికీ, తన ప్రాసెస్‌పైనే దృష్టి పెట్టానని ఈ 15 ఏళ్ల యంగ్ స్టార్ తెలిపాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డెబ్యూ చేసిన అతి చిన్న వయసు ప్లేయర్ గా వైభవ్ చరిత్ర సృష్టించాడు. అయితే, కొన్ని మ్యాచ్‌లలో తక్కువ రన్స్ చేయడంతో టీమ్ నుంచి తొలగించడంపై స్పందిస్తూడ్రాప్ చేసినప్పుడు కాస్త ఎమోషనల్ అయినా, కోచ్‌లు, ప్లేయర్స్ సపోర్ట్‌తో మళ్లీ ఫుల్ కాన్ఫిడెన్స్ సాధించా. క్రికెట్‌లో అప్ అండ్ డౌన్స్ కామన్" అని పేర్కొన్నాడు.
ఫిబ్రవరిలో హరారే వేదికగా జరిగిన యు-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై కేవలం 80 బంతుల్లోనే 175 రన్స్‌తో విరుచుకుపడి భారత్‌కు ప్రపంచకప్ అందించిన గుర్తును ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. అదే గ్రౌండ్‌లో మళ్లీ సీనియర్ టీమ్ నుంచి ఆడడం అన్‌బీలీవబుల్ ఫీలింగ్ అని ఆనందం వ్యక్తం చేశాడు. ఇక్కడి కండిషన్స్‌పై తనకు పక్కా ఐడియా ఉందన్న వైభవ్, మళ్లీ పాత ఫామ్‌ను రీక్రియేట్ చేసి జట్టుకు విజయాన్ని అందిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
ట్రెండింగ్ వార్తలు






















