అన్వేషించండి

Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!

Telangana Tenth Class Exams: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 5, 17, 727 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం ప్రభుత్వం మొత్తం 2, 676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు.
  • లక్షలాది విద్యార్థులకు సీఎం, గవర్నర్ నుండి ప్రోత్సాహకర సందేశాలు.
  • రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాలలో 5 లక్షల మందికి పైగా హాజరు.
  • పరీక్షా పారదర్శకతకు కఠిన నిబంధనలు, సెల్ ఫోన్ నిషేధం.

Telangana Tenth Class Exams: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన మైలురాయిగా భావంచే పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్షల మంది విద్యార్థులు భవిష్యత్‌ను నిర్ణయించే ఈ పరీక్షాపర్వం ఏప్రిల్ 16 వరకు కొనసాగనుంది. అటు ప్రభుత్వం, ఇటు విద్యాశాఖ ఉన్నతాధికారులు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. 

ముఖ్యమంత్రి, గవర్నర్ శుభాకాంక్షలు

పరీక్షలకు హాజరవుతున్న లక్షల మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. పదో తరగతి పరీక్షలు భవిష్యత్‌కు తొలి మెట్టు అని, విద్యార్థులు ఎవరూ భయం, ఆందోళన లేకుండా ఒత్తిడికి గురి కావద్దని సూచించారు. ఆత్మ విశ్వాసంతో, ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాసి ప్రతిభను చాటుకోవాలని సీఎం ఆకాంక్షించారు. 

తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా కూడా విద్యార్థులకు తన సందేశాన్ని పంపారు. పరీక్షలు ఒక భారంలా కాకుండా, తమ జ్ఞానాన్ని ప్రదర్శించే అద్భుతమైన అవకాశంగా భావించాలని ఆయన సూచించారు. సానుకూల దృక్పథం క్రమశిక్షణతో కూడిన సమయపాలన విజయానికి మార్గాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల వెనుక ఉండి వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, గురువుల కృషిని కూడా గవర్నర్‌ ఈ సందర్భంగా అభినందించారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 5, 17, 727 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం ప్రభుత్వం మొత్తం 2, 676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 1582 కేంద్రాలు, ప్రైవేటు పాఠశాలల్లో 1,094 కేంద్రాలను కేటాయించారు. 

మార్చీ 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు జరగనున్నాయి. ఉదయం పరీక్ష ప్రారంభమైన తర్వాత కేవలం ఐదు నిమిషాల వరకు మాత్రమే ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. అంటే ఉదయం 9.35 గంటల తర్వాత వచ్చే విద్యార్థులకు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం ఉండదు. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు కనీసం గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

పరీక్షల పారదర్శకత కోసం విద్యాశాఖ కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. పరీక్ష కేంద్రాలకు పూర్తి స్థాయిలో నో సెల్‌ ఫోన్‌ జోన్లుగా ప్రకటించారు. విద్యార్థులే కాదు, పరీక్ష సిబ్బంది, ఇన్విజిలేటర్లు, చివరకు చెక్ చేయడానికి వచ్చే స్క్వాడ్ అధికారులు కూడా సెల్‌ఫోన్లను లోపలికి తీసుకెళ్లకూడు. ఒక వేళ ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే వారిని సస్పెండ్ చేస్తారు. పరీక్షా పత్రాల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఏ ఉద్యోగి అయినా పేప్ లీకేజీలు పాల్పడిదే వారిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించింది. విద్యార్థుల సౌకర్యార్థం మోడల్ OMR షీట్లు, జవాబు పత్రాల ఫార్మట్‌ను బోర్డు అధికారికంగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షకు వెళ్లే ముందే వీటిని పరిశీలించడం ద్వారా విద్యార్థులు పరీక్షా సమయంలో తడబాటు లేకుండా ఉంటారు.  

Frequently Asked Questions

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి?

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమై ఏప్రిల్ 16 వరకు కొనసాగుతాయి.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు ఎంత మంది విద్యార్థులు హాజరు కానున్నారు?

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 5,17,727 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు.

పరీక్షలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు ప్రవేశం ఉంటుందా?

పరీక్ష ప్రారంభమైన తర్వాత కేవలం ఐదు నిమిషాల వరకు మాత్రమే ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. అంటే, ఉదయం 9:35 గంటల తర్వాత వచ్చే వారికి ప్రవేశం ఉండదు.

పరీక్ష కేంద్రాలలో సెల్ ఫోన్ వాడకంపై నిబంధనలు ఏమిటి?

పరీక్ష కేంద్రాలు పూర్తి స్థాయిలో నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించారు. విద్యార్థులు, సిబ్బంది, ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ అధికారులు కూడా సెల్ ఫోన్లను లోపలికి తీసుకెళ్లకూడదు.

టాప్ హెడ్ లైన్స్

Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
NEET SUPREME COURT:నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Career Options After MBBS in Telugu: ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?
ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Embed widget