అన్వేషించండి

టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?

Tata Tiago & Hyundai Grand i10 Nios మధ్య 0-100 కిమీ వేగం, రోలింగ్‌ యాక్సిలరేషన్‌, ఇంజిన్‌ వివరాలు, ధరలను ఎక్స్‌పర్ట్‌లు పోల్చారు. ఏ కారు మెరుగ్గా నిలిచిందో తెలుసుకోండి.

Tata Tiago vs Hyundai Grand i10 Nios: భారత మార్కెట్‌లో తొలి కారును కొనాలనుకునే వారి జాబితాలో ఎక్కువగా కనిపించే హ్యాచ్‌బ్యాక్‌లు Tata Tiago & Hyundai Grand i10 Nios. తక్కువ ధర, మంచి ఫీచర్లు, కుటుంబ అవసరాలకు సరిపోయే పరిమాణంతో ఈ రెండు కార్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే నగరంలో వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం ఏ కారుకు ఎక్కువ? 0-100 కిమీ వేగం, రోలింగ్‌ యాక్సిలరేషన్‌ పరీక్షల్లో ఏ మోడల్‌ మెరుగైన ఫలితాలు సాధించింది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ పోలికలో రెండు కార్ల పెట్రోల్‌ మాన్యువల్‌ వేరియంట్లను మాత్రమే పరీక్షించారు. Tata Tiagoలో 1.2 లీటర్‌ 3-సిలిండర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అందించారు. ఇది 86 హెచ్‌పీ శక్తి & 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు Hyundai Grand i10 Niosలో 1.2 లీటర్‌ 4-సిలిండర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 83 హెచ్‌పీ శక్తి & 114 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది.

కాగితాలపై చూస్తే Tiagoకు 3 హెచ్‌పీ ఎక్కువ శక్తి ఉండగా, Grand i10 Niosకు 1 ఎన్ఎం అదనపు టార్క్‌ ఉంది. రెండు కార్లలోనూ ఫ్రంట్‌ వీల్‌ డ్రైవ్‌ (FWD) వ్యవస్థతో పాటు 5-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ను అందించారు. ఇంధన ట్యాంక్‌ సామర్థ్యంలో మాత్రం Grand i10 Nios 37 లీటర్లతో స్వల్ప ఆధిక్యం సాధించింది. Tiagoలో 35 లీటర్ల ట్యాంక్‌ ఉంది.

ఇది కూడా చదవండి: 2026 Maruti Brezza మైలేజ్‌ నంబర్లు ఇవిగో - పెట్రోల్‌, టర్బో, CNG వేరియంట్ల పూర్తి వివరాలు

నిజ జీవిత పరీక్ష
అయితే, వాస్తవ రోడ్డు పరీక్షల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి Tata Tiagoకు 16.18 సెకన్లు పట్టగా, Hyundai Grand i10 Nios కేవలం 13.28 సెకన్లలోనే అదే వేగాన్ని అందుకుంది. అంటే Tiago కంటే Grand i10 Nios దాదాపు 2.9 సెకన్లు వేగంగా లక్ష్యాన్ని చేరుకుంది. ఇంజిన్‌ మరింత స్మూత్‌గా పనిచేయడం, గేర్‌ మార్పులు సులభంగా ఉండటం, క్లచ్‌ ఆపరేషన్‌ తేలికగా ఉండటం Grand i10 Niosకు ఈ ఆధిక్యాన్ని తీసుకొచ్చిన ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.

రోలింగ్‌ యాక్సిలరేషన్‌ పరీక్షల్లో కూడా Hyundai Grand i10 Niosనే ఆధిపత్యం చాటింది. మూడో గేర్‌లో 20 నుంచి 80 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి Tiagoకు 16.36 సెకన్లు పట్టగా, Grand i10 Nios కేవలం 14 సెకన్లలోనే ఈ పరీక్షను పూర్తి చేసింది. అంటే దాదాపు 2.36 సెకన్ల తేడాతో Nios ముందంజలో నిలిచింది.

నాలుగో గేర్‌లో 40 నుంచి 100 కిలోమీటర్ల వేగం పరీక్షలో కూడా Grand i10 Nios మెరుగైన ఫలితాన్ని నమోదు చేసింది. Tiago ఈ పరీక్షను 23.44 సెకన్లలో పూర్తి చేయగా, Grand i10 Nios 22.44 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అంటే మరోసారి ఒక సెకను తేడాతో Hyundai హ్యాచ్‌బ్యాక్‌ విజయం సాధించింది.

ఇది కూడా చదవండి: ₹50,000 డౌన్ పేమెంట్‌తో టాటా టియాగోను కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత ఉంటుంది?

ధరలు
ధరల పరంగా మాత్రం Tata Tiago స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది. Tiago ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.4.70 లక్షల నుంచి రూ.7.30 లక్షల వరకు ఉండగా, Hyundai Grand i10 Nios ధర రూ.5.60 లక్షల నుంచి రూ.7.52 లక్షల వరకు ఉంది. ఎంట్రీ లెవల్‌ వేరియంట్‌లో Tiago కంటే Grand i10 Nios ధర రూ.90 వేల వరకు ఎక్కువ. టాప్‌ వేరియంట్‌లో కూడా Grand i10 Nios దాదాపు రూ.22 వేల అధిక ధరను కలిగి ఉంది.

మొత్తంగా చూస్తే పనితీరు, యాక్సిలరేషన్‌, నగర డ్రైవింగ్‌లో చురుకుదనం కోరుకునే వారికి Hyundai Grand i10 Nios మెరుగైన ఎంపికగా నిలుస్తోంది. 0-100 కిమీ వేగం పరీక్షతో పాటు రోలింగ్‌ యాక్సిలరేషన్‌లో కూడా ఇది Tata Tiagoను స్పష్టంగా అధిగమించింది. మరోవైపు తక్కువ బడ్జెట్‌లో మంచి హ్యాచ్‌బ్యాక్‌ను కొనాలనుకునే వారికి Tata Tiago ఇప్పటికీ ఆకర్షణీయమైన ఎంపికగానే ఉంది. అంటే మీ ప్రాధాన్యం వేగం & స్మూత్‌ డ్రైవింగ్‌ అయితే Grand i10 Niosను ఎంచుకోవచ్చు. తక్కువ ధరలో విలువైన కారు కావాలంటే Tata Tiago మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Kawasaki Z650 కంటే రూ.33,000 అదనపు ధరకు Kawasaki Z650 Sలో ఏం ఉంది? రెండు మోడళ్ల కంపారిజన్‌
Kawasaki Z650 vs Z650 S: ధరలో తేడా ఎంత? కొత్త మోడల్‌లో వచ్చిన మార్పులేంటి?
Force e-Traveller: ఫోర్స్‌ మోటార్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ ట్రావెలర్స్‌, అంబులెన్స్‌.. తుది పరీక్షల్లో EVలు
Force Motors ట్రావెలర్‌ EVలు మార్కెట్‌లోకి రాబోతున్నాయి.. ఎలక్ట్రిక్ అంబులెన్స్ కూడా!
ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్‌కు బెస్ట్ ఎలక్ట్రిక్ SUVలు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 478km వరకు ప్రయాణం!
లాంగ్‌ డ్రైవ్‌ వెళ్లేవాళ్ల కోసమే ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్‌ కార్లు.. కనీసం 400km రేంజ్‌ గ్యారెంటీ!
BMW F 450 GS లో Base నుంచి GS Trophy వరకు నాలుగు వేరియంట్లు.. ఏ వేరియంట్‌ బెటర్‌?
BMW అడ్వెంచర్ బైక్ F 450 GSలో 4 వేరియంట్లు.. ఏ మోడల్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Bulgaria Road Accident: బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
TDP Action On MLAs: ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
Pending Municipalities Elections : ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
CII Partnership Summit: ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
Embed widget