అన్వేషించండి

కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు

Cockroach Janta Party | సుప్రీంకోర్టు విచారణలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన కాక్రోచ్ వ్యాఖ్యతో మొదలైన సీజేపీ విద్యార్థి ఉద్యమం 36 రోజుల్లో దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మారి విజయాన్ని సాధించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • CJI
  • వాంగ్‌చుక్ చేరిక, పోలీసు చర్యలు, పార్లమెంట్ మార్చ్ ఉద్యమాన్ని ఉధృతం చేశాయి.
  • చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు ఈ ఉద్యమం దారితీసింది.

CJP Protest | న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా చేసిన బొద్దింక (Cockroach) కామెంట్‌తో ప్రారంభమైన ఉద్యమం కొన్ని వారాల్లోనే దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమంగా తీవ్రరూపం దాల్చింది. చివరకి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేలా చేస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసింది. కేంద్ర మంత్రి రాజీనామా చేసిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆయన చేసిన కాక్రోచ్ వ్యాఖ్యే విద్యార్థులకు ఒక చిహ్నాన్ని ఇచ్చిందని, అది మొత్తం ఉద్యమానికి కొత్త గుర్తింపును తెచ్చిందని ఉద్యమంతో సంబంధం ఉన్నవారు గట్టిగా నమ్ముతున్నారు.

ఉద్యమానికి గుర్తింపుగా మారిన బొద్దింక

సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్ కాక్రోచ్ కామెంట్ తర్వాత 'బొద్దింక' అనే పదం సోషల్ మీడియాలో ఉద్యమానికి ఆదారంగా నిలిచింది. వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో బొద్దింక ఎమోజీలు, మీమ్స్, కార్టూన్లు, సెటైర్ పోస్ట్‌లు వేగంగా వైరల్ అయ్యాయి. ఈ చిహ్నాన్ని ఆధారంగా చేసుకుని అభిజిత్ దీప్కే అనే ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ (CJP)ని స్థాపించారు. మొదట్లో ఇది ఒక సెటైరికల్ సోషల్ మీడియా పేజీ అనుకున్నారు. చూస్తుండగానే ఇది విద్యార్థి ఉద్యమానికి గొంతుకగా మారింది. కాక్రోచ్ సోషల్ మీడియా అకౌంట్ పై చర్యలు తీసుకోగా..  'కాక్రోచ్ ఈజ్ బ్యాక్' పేరుతో కొత్త ఖాతా తెచ్చారు. బొద్దింకలు ఎప్పటికీ నాశనం కావు అనేది దీని ట్యాగ్ లైన్. 


కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు

సోషల్ మీడియా నుంచి రోడ్ల మీదకు చేరిన ఉద్యమం

గతంలో వచ్చిన అనేక విద్యార్థి ఉద్యమాలకు భిన్నంగా, ఈ ఉద్యమం మొదట సోషల్ మీడియాలో మొదలైంది. ఆపై రోడ్లపైకి వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ కొన్ని రోజుల్లోనే దేశంలోని అతిపెద్ద డిజిటల్ కమ్యూనిటీలలో ఒకటిగా మారగా ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి దాదాపు 2.63 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా, కాంగ్రెస్‌కు దాదాపు 1.48 కోట్లు, బీజేపీకి దాదాపు 95 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

Also Read: Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి  

రీల్స్, మీమ్స్, లైవ్ స్ట్రీమ్‌లు, ఢిల్లీలోని జంతర్ మంతర్ నుండి నిరంతర అప్‌డేట్‌లు ఈ ఉద్యమాన్ని నేరుగా సంబంధం లేని వ్యక్తులకు కూడా దగ్గర చేశాయి. ఉద్యమం పరిధి పెరిగే కొద్దీ, దాని అనేక సోషల్ మీడియా ఖాతాలపై నిషేధాలు, చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత భావ ప్రకటనా స్వేచ్ఛ, సోషల్ మీడియా నియంత్రణపై చర్చ ప్రారంభమైంది.

జూన్ 6న మొదటిసారి రోడ్డుపై ప్రభావం

ఆన్‌లైన్ మద్దతు తరువాత సీజేపీ తొలి ప్రభావం జూన్ 6న కనిపించింది. విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపడానికి భారీ ఎత్తున చేరుకున్నారు. ఆ తర్వాత దేశంలోని అనేక నగరాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. వివిధ కాలేజీలు, స్థానిక స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు విద్యార్థులకు మద్దతుగా మార్చ్‌లు, చర్చలు, బహిరంగ సభలను నిర్వహించడం ప్రారంభించారు.

జూన్ 20న ఉద్యమం కొత్త మలుపు 

జూన్ 20న ఉద్యమం కొత్త మలుపు తిరిగింది. సీజేపీ పిలుపుతో ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాల నుండి వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ చేరుకున్నారు. నిరసన ముగిసిన తర్వాత కూడా విద్యార్థులు ధర్నా స్థలాన్ని వదిలి వెళ్లలేదు. పోలీసులు నిరసనను అనేకసార్లు చట్టవిరుద్ధమని ప్రకటించినా, విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. ఒక రోజు నిరసన క్రమంగా 24 గంటల నిరంతర ధర్నాగా మారింది.

Also Read: CJP Founder Abhijit Dipke: కేంద్రంతో చర్చలు సఫలం.. దీక్ష విరమించిన సీజేపీ- యువతకు అభిజీత్ దీప్కే కీలక సూచనలు

తర్వాత AISA, AISF, SFI తో పాటు KYS వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా ధర్నాలో పాల్గొన్నాయి. నిరసనకారుల కోసం ఆహారం, నీళ్లు,  వైద్య సౌకర్యాలు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి ఏర్పాటు చేసి సపోర్ట్ చేశారు. చాలా మంది కొన్ని గంటలు లేదా ఒక రాత్రి ధర్నాలో పాల్గొని తిరిగి వెళ్ళిపోయారు.


కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు

సోనమ్ వాంగ్‌చుక్ చేరికతో పెరిగిన ప్రభావం

జూన్ 28న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఉద్యమంలో చేరగా విద్యార్థుల్లో నమ్మకం పెరిగింది. ఆయన ఆరుగురు విద్యార్థి కార్యకర్తలతో కలిసి నిరాహార దీక్ష ప్రారంభించగా.. విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు, విద్యావేత్తలు, పదవీ విరమణ చేసిన అధికారులు, లాయర్లు, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు మద్దతు తెలిపారు. వాంగ్ చుక్ దీక్షతో జంతర్ మంతర్‌కు సీజేపీ కార్యకర్తలు, జెన్ జీ యువత భారీగా తరలివచ్చేవారు. నిరాహార దీక్షలో ఉన్న విద్యార్థుల రోజువారీ హెల్త్ బులెటిన్ కూడా చర్చనీయాంశంగా మారింది.

పోలీసు చర్యల తర్వాత మరింత ఉధృతంగా ఉద్యమం

వాంగ్‌చుక్‌ను దీక్ష చేయకుండా తరలించడం, ఆసుపత్రిలో చేర్చడం, ఈ క్రమంలో నిరసనకారులపై పోలీసు చర్యలు సీజేపీ ఉద్యమానికి మరింత ఊపందించాయి. ప్రతిపక్ష పార్టీలు, అనేక సామాజిక సంస్థలు, అనేక ప్రముఖులు పోలీసు చర్యలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యమానికి మరింత అనూహ్యంగా పెరిగింది. 


కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు

జూలై 20న పార్లమెంట్ మార్చ్ పెద్ద మలుపు 

జూలై 20న పార్లమెంట్ మార్చ్ సీజేపీ ఉద్యమానికి అతిపెద్ద మైలురాయిగా నిలిచింది. భారీ బారికేడింగ్‌లు ఉన్నప్పటికీ, వేలాది మంది విద్యార్థులు పార్లమెంట్ వైపు ఉత్సాహంగా కదిలారు. పోలీసులు గుంపును ఆపడానికి లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ఉపయోగించారు. చర్యల సమయంలో పెల్లెట్ గన్‌లను కూడా ఉపయోగించారని నిరసనకారులు ఆరోపించారు. పోలీసు చర్యల తర్వాత కూడా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. ముంబై, ఇండోర్, నాగ్‌పూర్, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు సహా అనేక నగరాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. విదేశాలలో నివసిస్తున్న ఇండియన్స్ కూడా ఉద్యమానికి మద్దతుగా నిరసనలు తెలిపారు.

మీమ్స్, జాతీయ గీతంతో విభిన్నంగా కనిపించిన ఉద్యమం

ఈ ఉద్యమంలో నిరసనకారులు మీమ్స్, వ్యంగ్యాన్ని ఉపయోగించారు, పోలీసులకు పూలు ఇచ్చారు. కొందరు వారితో సెల్ఫీలు తీసుకున్నారు. ధర్నా స్థలంలో మహాత్మా గాంధీ దండి యాత్ర, డా. బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్, రాజ్యాంగాన్ని ఉద్యమ చిహ్నాలుగా ప్రదర్శించారు. పోలీసు బారికేడ్‌ల ముందు జాతీయ గీతం పాడారు. అనేక చోట్ల బాలీవుడ్ పాటలతో ప్రదర్శనలు కూడా జరిగాయి.

ఉద్యమం ఏ ఒక్క నేతకు పరిమితం కాలేదు

పేపర్ లీక్‌పై సీజేపీ చేపట్టిన ఉద్యమం రాజకీయాలకు అతీతంగా జరగడం వారికి కలిసొచ్చింది. జంతర్ మంతర్ చేరుకున్న చాలా మంది వ్యక్తులు అభిజిత్ దీప్కేను ఇంతకు ముందు కలవలేదు. అతెనెవరో తెలియదు. CJPతో వారికి ప్రత్యక్ష సంబంధం లేదు. మరోవైపు సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ అప్‌డేట్‌లు, విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్, ఛలో పార్లమెంట్ లాంటి ఘటనలు ఉద్యమాన్ని మలుపుతిప్పాయి. చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా.. ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.

Frequently Asked Questions

కాక్రోచ్ ఉద్యమం ఎలా ప్రారంభమైంది?

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు ఎవరు?

ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ అభిజిత్ దీప్కే

కాక్రోచ్ ఉద్యమం దేనికి దారితీసింది?

ఈ ఉద్యమం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసింది. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేసింది.

ఈ ఉద్యమం మొదట ఎక్కడ ప్రారంభమైంది?

ఈ ఉద్యమం మొదట సోషల్ మీడియాలో ప్రారంభమైంది. ఆ తర్వాత జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రోడ్లపైకి చేరింది.

సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమంలో ఎలా పాలుపంచుకున్నారు?

జూన్ 28న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఉద్యమంలో చేరి, ఆరుగురు విద్యార్థి కార్యకర్తలతో కలిసి నిరాహార దీక్ష ప్రారంభించి విద్యార్థుల్లో నమ్మకం పెంచారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
Embed widget