అన్వేషించండి

Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి  

Dharmendra Pradhan Resignation | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు,.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాష్ట్రపతి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా; ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు.
  • నీట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన్ రాజీనామా చేశారు.
  • సీబీఐ దర్యాప్తు; కాక్రోచ్ జనతా పార్టీ నిరసనను విరమించుకుంది.

Pralhad Joshi Education Minister | న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కేంద్ర కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాక్రోచ్ జనతా పార్టీ, జెన్ జీ ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. నీట్ పేపర్ లీక్ విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్రం సుమోటోగా తీసుకుని, సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేస్తుందని రాజీనామా తరువాత ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. 

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖదన అదనపు బాధ్యతలను అప్పగించారు. కేబినెట్ మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం శనివారం తమ డిమాండ్లు అంగీకరించడంతో నీట్ వివాదంపై చేపట్టిన తమ ఆందోళనను విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రకటించింది. జంతర్ మంతర్ నుంచి మొదలుకుని దేశవ్యాప్త నిరసనలు, విద్యార్థుల డిమాండ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకున్నారు. దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మొదట తన పదవికి రాజీనామా చేయగా, ఇప్పుడు ప్రధాని మోదీ దానిని ఆమోదించారు. 

వాంగ్ చుక్ దీక్ష విరమణ..
శనివారం మధ్యాహ్నం పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ ప్రధానికి తన రాజీనామాను సమర్పించారు. గత నెల రోజులుగా పేపర్ లీక్ వ్యవహారం, అస్తవ్యస్త విద్యా వ్యవస్థపై విద్యార్థులు ఢిల్లీ నుంచి గల్లీ వరకు.. దేశంలోని ఇతర ప్రాంతాలలో విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం తమ గళాన్ని బలంగా వినిపించారు. వీరే కాకుండా జంతర్ మంతర్ వద్ద పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేశడం తెలిసిందే. మోదీ ప్రకటన, ప్రభుత్వ హామీ తర్వాత ఆయన తన నిరాహార దీక్షను విరమించారు.

ఉత్సహంగా సీజేపీ.. యువతకు కీలక సూచనలు
ఇటు, ప్రధాన్ రాజీనామా తర్వాత కాక్రోచ్ జనతా పార్టీలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు చేసుకుంటున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామాతో పాటు సీజేపీ యొక్క ఇతర డిమాండ్లను కూడా ప్రభుత్వం అంగీకరించింది. జూలై 20న ఢిల్లీలో జరిగిన పార్లమెంట్ మార్చ్‌పై పోలీసుల నిర్బంధ చర్యల తర్వాత దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ ఉధృతమైంది. అయితే ఆ తర్వాత స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి, విద్యార్థుల డిమాండ్లు సమర్థనీయమైనవని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని, పేపర్ లీక్ పై కఠిన చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ ఆందోళనను విరమిస్తున్నట్లు సీజేపీ నేతలు ప్రకటించారు. మూడు విడతల చర్చల తర్వాత ప్రభుత్వం, సీజేపీ మధ్య అంగీకారం కుదిరింది.

మొదట్నుంచీ బాధ్యత తీసుకున్నాను.. ముఖం చాటేయలేదు: ధర్మేంద్ర ప్రధాన్
ధర్మేంద్ర ప్రధాన్ 'నేను నా రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపాను. నేను మొదటి రోజు నుంచే బాధ్యత తీసుకున్నాను. ఇలాంటి పరిస్థితులకు ముఖం చాటేయలేదు. గత 10 రోజుల పరిణామాలు నా మనసును కలచివేశాయి. ఇది నాకు వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం మాత్రం కాదు' అని ఆయన అన్నారు.

Frequently Asked Questions

ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు?

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఆయన ప్రధానికి తన రాజీనామాను సమర్పించారు.

విద్యాశాఖ మంత్రిగా ఎవరు అదనపు బాధ్యతలు స్వీకరించారు?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఆదేశాలు జారీ చేశారు.

నీట్ పేపర్ లీక్ కేసును ఎవరు దర్యాప్తు చేస్తారు?

నీట్ పేపర్ లీక్ కేసును కేంద్ర ప్రభుత్వం సుమోటోగా తీసుకుని, సీబీఐ దర్యాప్తు చేస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget