DC vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam
కాటేరమ్మ కొడుకులు ఈ సారి 300 కొట్టేస్తారు అని సన్ రైజర్స్ ఫ్యాన్స్ హైప్ ఎక్కించుకుంటుంటే వాళ్లు మాత్రం వరుసగా రెండో మ్యాచ్ లోనూ కాటేయించుకున్నారు. ఈ సారి కాటేసింది తాము కూడా తెలుగు టీమే అని ప్రచారం చేసుకున్న తెలుగు క్యాపిటల్స్ ఛీఛీ ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో. సన్ రైజర్స్ కాటేరమ్మ కొడుకులు ఉంటే మేం వైజాగ్ బేస్డ్ ఛత్రపతి కాట్రాజు కొడుకులం అన్నట్లు కర కరా నిమిలి పారేశారు ఢిల్లీ క్యాపిటల్స్. సన్ రైజర్స్ పై వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. స్టార్క్ ఫైర్ స్ట్రామ్
ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ అవాక్కైందన్నా...ఢిల్లీ క్యాపిటల్స్ కాలర్ ఎగరేసిందన్నా రీజన్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ స్టార్క్. ఆస్ట్రేలియన్ పేసర్ గా తనుకున్న అనుభవం లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో రెండు సార్లు సన్ రైజర్స్ కి స్ట్రోక్ ఇచ్చిన ఫామ్ ను కంటిన్యూ చేస్తూ మిచెల్ స్టార్క్ సన్ రైజర్స్ భరతం పట్టాడు. హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, చివర్లో ముల్డర్, హర్షల్ పటేల్ అలా స్టార్క్ ఖాతాలో బలవ్వని సన్ రైజర్స్ ఆటగాడు లేడు. మొత్తంగా 3.4 ఓవర్లలో 35 రన్స్ ఇచ్చి ఏకంగా 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు మిచెల్ స్టార్క్.
2. అల్లాడించిన అనికేత్ వర్మ
సన్ రైజర్స్ బ్యాటింగ్ లో అభిషేక్ రనౌట్ అయినా..మిగిలిన ముగ్గురు బ్యాటర్లైన హెడ్, ఇషాన్ కిషన్, నితీ శ్ రెడ్డిని స్టార్క్ అవుట్ చేసినా..సన్ రైజర్స్ 163పరుగులు చేసిందంటే రీజన్ యంగ్ స్టర్ అనికేత్ వర్మ. 41 బాల్స్ లో 5 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 74పరుగులు చేసిన అనికేత్.. క్లాసెన్ తో కలిసి సన్ రైజర్స్ ను కోలుకునేలా చేశాడు. క్లాసెన్ ను మోహిత్ శర్మ అవుట్ చేసినా టెయింలెడర్లతో స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ సూపర్ బ్యాటింగ్ చేశాడు అనికేత్ వర్మ. మ్యాచ్ సన్ రైజర్స్ ఓడిపోయినా అనికేత్ వర్మ ఎప్పటికీ గుర్తుంచుకోదగిన మంచి ఇన్నింగ్స్ ఇది.
3. కూల్ కుల్దీప్ యాదవ్
ఓ వైపు స్టార్క్ 5 వికెట్లతో సన్ రైజర్స్ పై విరుచుకుపడినా మరో వైపు కుల్దీప్ యాదవ్ కూల్ గా పరుగులను కట్టడి చేశాడు. తన 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు కుల్దీప్. అందులో ప్రమాదకరంగా మారిన అనికేత్ వర్మ తో పాటు అభినవ్ మనోహర్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వికెట్లు ఉన్నాయి. స్టార్క్ తో కలిసి కుల్దీప్ చేసిన కంట్రోల్ తోనే సన్ రైజర్స్ 163పరుగులకు ఆలౌట్ అయిపోయింది.
4. సూపర్ జోడీ ఫాప్, JFM
సన్ రైజర్స్ విసిరిన 164పరుగుల టార్గెట్ ను ఢిల్లీ సునాయాసంగా చేధించింది అంటే రీజన్ ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్, ఫాఫ్ డుప్లెసిస్. JFM తన శైలికి భిన్నంగా ఆచి తూచి ఆడితే...ఫాఫ్ డుప్లెసి మాత్రం స్లో వికెట్ పై టైమింగ్ తో అద్భుతమైన షాట్స్ కొట్టాడు. జేక్ ఫ్రేజర్ 38 పరుగులు చేస్తే..ఫాఫ్ 27 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో సరిగ్గా 50 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరి కారణంగా 9 ఓవర్లలోనే 81 పరుగుల ఓపెనింగ్ పార్టనర్ షిఫ్ ను ఏర్పాటు చేసి విజయానికి పునాదులు వేసుకుంది ఢిల్లీ.
5. కేఎల్..పోరల్ ఫినిషింగ్..ఆకట్టుకున్న అన్సారీ
ఫాఫ్, JFM అయిపోయినా మిగిలిన పనిన కేఎల్ రాహుల్, అభిషేక్ పోరల్, స్ట్రబ్స్ కలిసి పూర్తి చేశారు. ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న కేఎల్ అయితే ఆడిన ఐదు బంతుల్లోనే 2ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. అవికూడా కళాత్మకమైన షాట్స్. పోరల్ 34పరుగులు, స్ట్రబ్స్ 21 పరుగులతో మిగిలిన పని పూర్తి చేసేయటంతో ఢిల్లీ 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 166పరుగులు చేసి 7వికెట్ల తేడాతో సన్ రైజర్స్ ను మట్టికరిపించింది. సన్ రైజర్స్ బౌలర్లంతా విఫలమైనా యువ స్పిన్నర్ జీషన్ అన్సారీకి స్పెషల్ అప్రియేషన్ ఇవ్వాలి. 4 ఓవర్లలో 42 రన్స్ ఇచ్చినా కూడా 3 వికెట్లు తీశాడు అన్సారీ. తనదైన శైలిలో లెగ్ స్పిన్ విసురుతూ JFM, FAF, KL ల ను అవుట్ చేసి కంగారు పెట్టినా విజయం మాత్రం ఢిల్లీనే వరించింది.





















