Trisha: ఎయిర్ పోర్టులో త్రిష... మీడియా ప్రశ్నల వర్షం - సౌత్ క్వీన్ ఏం చెప్పారంటే?
Vijay Trisha Latest News: తమిళనాట విజయ్ - త్రిష వ్యవహారం రోజు రోజుకూ మరింత చర్చకు దారి తీస్తోంది. వాళ్ళిద్దరూ రిసెప్షన్‌కు వెళ్లడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై త్రిష ఏం చెప్పారంటే?

Trisha Spotted At Airport: తమిళ రాజకీయాలు త్రిష చుట్టూ తిరుగుతున్నాయి. సౌత్ క్వీన్ వార్తల్లో వ్యక్తిగా మారి చాలా కాలమైంది. దళపతి విజయ్ (Thalapathy Vijay)తో ఆమె రిలేషన్షిప్ గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారంతా. అదీ వాళ్ళిద్దరి నోటి నుంచి వస్తే ఇంకా బావుంటుందని ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఎయిర్ పోర్టులో మీడియా కంట పడింది త్రిష. దాంతో ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మేడమ్... మేడమ్... విజయ్ & మీరూ!
ఓ తమిళ నిర్మాత కుమారుడి రిసెప్షన్‌కు విజయ్, త్రిష జంటగా హాజరు అయ్యారు. అదీ విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత తమిళనాడులో ఓ కోర్టును ఆశ్రయించిన కొన్ని రోజులకు, తన భర్తకు ఓ నటిగా వివాహేతర సంబంధం ఉందని ఆరోపించిన తర్వాత!
విజయ్ భార్య చెప్పినది త్రిష గురించి అని చాలా మంది భావించారు. త్రిష కూడా విజయ్ వెంట పెళ్లి వేడుకకు వచ్చారు. వాళ్ళిద్దరి మీద నటుడు పార్తీబన్ విమర్శలు చేశారు. 'త్రిష ఇంట్లో ఉండటం మంచిది' అని అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. త్రిష కౌంటర్ ఇవ్వడం, పార్తీబన్ మరొక వీడియో విడుదల చేయడం, అందులో త్రిషపై మాటల దాడి చేశారు. ఈ తరుణంలో ఎయిర్ పోర్టులో మీడియా కంట పడ్డారు త్రిష.
Also Read: Allu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?
మీడియా ముందుకు త్రిష ఎప్పుడు వస్తారా? అని తమిళనాడులో వెయిట్ చేసే జనాలు ఎంతో మంది ఉన్నారు. అయితే... వాళ్లందరికీ ఎయిర్ పోర్టులో త్రిష కనిపించడంతో ఆమె వెంట పడ్డారు. విజయ్ ప్రస్తావన తీసుకు వచ్చారు. అయితే త్రిష మాత్రం తన పని తాను చూసుకున్నారు.
Press to @trishtrashers: Madam, You & Vijay sir recently attended a marriage event together and that’s creating lots of controversies…what’s your take on this?
— KARTHIK DP (@dp_karthik) March 13, 2026
Trisha slays the press by not even caring about those stupid questions. 😎🔥pic.twitter.com/HFPyOYgSEo
నో మోర్ రియాక్షన్... తన వెంట మీడియా పడుతున్న సంగతి కూడా తనకు తెలియదన్నంత స్థాయిలో త్రిష ఎయిర్ పోర్టులో నడిచారు. విజయ్ విజయ్ అని ప్రశ్నలు వస్తున్నప్పటికీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. నడుచుకుంటూ వెళ్లారు తప్ప పెదవి విప్పలేదు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. త్రిష వ్యవహారశైలి బట్టి ఒక్క విషయం అర్థం అవుతోంది... విజయ్ వ్యవహారం గురించి ఆవిడ పెదవి విప్పరని, మౌనంగా ఉంటారని అర్థం అవుతోంది.
Also Read: ఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల
ట్రెండింగ్ వార్తలు




















