South Indian cuisine Ugadi Pulihora Recipe : ఉగాది స్పెషల్ పులిహోర రెసిపీ.. ఈ రెసిపీ ఫాలో అయితే రుచి అమోఘంగా ఉంటుంది
Ugadi Special Recipe : ఉగాదికి పులిహోరను కొత్తగా, మరింత టేస్టీగా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే అద్భుతమైన రుచిని అందించే ఈ పులిహోర రెసిపీని ఫాలో అయిపోండి.

Ugadi Special Pulihora Recipe : పండుగల సమయంలో ఇంట్లో కచ్చితంగా పులిహోర ఉండాల్సిందే. ఉగాది సమయంలో దీనిని కచ్చితంగా తయారు చేసుకుంటారు. షడ్రుచులను అందించే ఈ ఉగాది రోజు రుచిని మరింత పెంచే టేస్టీ పులిహోర తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ టేస్టీ పులిహోర రెసిపీని ఫాలో అయిపోండి. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాలు - 1 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
సాయి మినపప్పు - 1 టీస్పూన్
కరివేపాకు - గుప్పెడు
ఎండుమిర్చి - 6
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
శనగపప్పు - 1 టీస్పూన్
జీడిపప్పులు - 20
వేరుశనగలు - అరకప్పు
కరివేపాకు - రెండు రెబ్బలు
ఎండుమిర్చి - 6
ఇంగువ - చిటికెడు
పచ్చిమిర్చి - 8
చింతపండు గుజ్జు - 1 కప్పు
నిమ్మ ఉప్పు - 1 టీస్పూన్
బెల్లం - 1 టీస్పూన్
పసుపు - 1 టీస్పూన్
తయారీ విధానం
ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ ఉంచండి. దానిలో శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఆవాలు, సాయి మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. నూనె వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి దోరగా వేగిన తర్వాత కాస్త చల్లారనిచ్చి మిక్సీజార్లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని పక్కన ఉంచుకోవాలి.
ఇప్పుడు మళ్లీ స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. దానిలో నూనె వేసి.. ఆవాలు, జీలకర్ర వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. అవి కాస్త రోస్ట్ అయిన తర్వాత జీడిపప్పు, పల్లీలు వేసి వేయించాలి. జీడిపప్పు ఆప్షనల్ మాత్రమే. కానీ పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. అలాగే పల్లీలు ఇష్టపడేవారు వాటిని కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత కరివేపాకు రెబ్బలు, ఎండు మిర్చి వేసి కలపాలి. ఇంగువ వేసి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి.
చింతపండు గుజ్జు వేసి మిశ్రమాన్ని కాస్త బాగా కలపాలి. చింతపండును వేడినీటిలో నానబెడితే గుజ్జు మంచిగా వస్తుంది. ఇలా కలిపిన మిశ్రమంలో ముందుగా తయారు చేసుకున్న పొడిని వేసుకుని బాగా కలపాలి. దానిలోనే నిమ్మ ఉప్పు, బెల్లం తురుము, పసుపు వేసి కలపాలి. ఇవన్నీ బాగా ఉడికి దగ్గరగా అయ్యేవరకు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. దగ్గరగా అయ్యాక స్టౌవ్ ఆపేయాలి.
ముందుగా పలుకుగా ఉడికించుకున్న అన్నాన్ని.. ఓ ప్లేట్లోకి తీసుకుని తడి ఆరనివ్వాలి. దానిలో తయారు చేసుకున్న పులిహోర తాళింపును వేసి బాగా కలుపుకోవాలి. రుచికి తగ్గట్లు ఉప్పును వేసుకుని.. అన్నంలో తాళింపును కలిపితే మంచి రుచి మీ సొంతమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఈ ఉగాదికి టేస్టీగా ఈ పులిహోర రెసిపీని ట్రై చేసేయండి.
Also Read : ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు రెసిపీ.. భక్ష్యాలను టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోండిలా
Ingredients
- 1 Tablespoon శనగపప్పు
- 1 Tablespoon ధనియాలు
- 1 Teaspoon జీలకర్ర
- 1 Teaspoon మిరియాలు
- 1 Teaspoon ఆవాలు
- 1 Teaspoon సాయి మినపప్పు
- 1 Tablespoon కరివేపాకు
- 6 Piece ఎండుమిర్చి
- 2 Tablespoon నూనె
- 1 Teaspoon ఆవాలు
- 1 Teaspoon జీలకర్ర
- 1 Tablespoon శనగపప్పు
- 20 Piece జీడిపప్పులు
- 0.50 Cup వేరుశనగలు
- 1 Teaspoon కరివేపాకు
- 6 Piece ఎండుమిర్చి
- 1 Pinch ఇంగువ
- 8 Piece పచ్చిమిర్చి
- 1 Cup చింతపండు గుజ్జు
- 1 Teaspoon నిమ్మ ఉప్పు
- 1 Teaspoon బెల్లం
- 1 Teaspoon పసుపు
Cooking Instructions
శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఆవాలు, సాయి మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకుని దానిని పౌడర్ చేసి పెట్టుకోవాలి.
తర్వాత నూనెలో మిగిలిన పదార్థాలన్నీ తాళింపు వేసి దానిలో ఈ పొడిని, చింతపండు గుజ్జును కూడా వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఉడికించిన అన్నంలో వేసి బాగా కలపాలి. అంతే టేస్టీ టేస్టీ ఉగాది పులిహోర రెసిపీ రెడీ.
Summary
Ugadi Pulihora Recipe : ఉగాది స్పెషల్ పులిహోర రెసిపీ.. ఈ రెసిపీ ఫాలో అయితే రుచి అమోఘంగా ఉంటుంది
Ugadi Special Recipe : ఉగాదికి పులిహోరను కొత్తగా, మరింత టేస్టీగా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే అద్భుతమైన రుచిని అందించే ఈ పులిహోర రెసిపీని ఫాలో అయిపోండి.
Ingredients
- 1 Tablespoon శనగపప్పు
- 1 Tablespoon ధనియాలు
- 1 Teaspoon జీలకర్ర
- 1 Teaspoon మిరియాలు
- 1 Teaspoon ఆవాలు
- 1 Teaspoon సాయి మినపప్పు
- 1 Tablespoon కరివేపాకు
- 6 Piece ఎండుమిర్చి
- 2 Tablespoon నూనె
- 1 Teaspoon ఆవాలు
- 1 Teaspoon జీలకర్ర
- 1 Tablespoon శనగపప్పు
- 20 Piece జీడిపప్పులు
- 0.50 Cup వేరుశనగలు
- 1 Teaspoon కరివేపాకు
- 6 Piece ఎండుమిర్చి
- 1 Pinch ఇంగువ
- 8 Piece పచ్చిమిర్చి
- 1 Cup చింతపండు గుజ్జు
- 1 Teaspoon నిమ్మ ఉప్పు
- 1 Teaspoon బెల్లం
- 1 Teaspoon పసుపు
Main Procedure
శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఆవాలు, సాయి మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకుని దానిని పౌడర్ చేసి పెట్టుకోవాలి.
తర్వాత నూనెలో మిగిలిన పదార్థాలన్నీ తాళింపు వేసి దానిలో ఈ పొడిని, చింతపండు గుజ్జును కూడా వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఉడికించిన అన్నంలో వేసి బాగా కలపాలి. అంతే టేస్టీ టేస్టీ ఉగాది పులిహోర రెసిపీ రెడీ.














