Solar Eclipse Timings: మార్చి 29 శనివారం అమావాస్య, సూర్య గ్రహణం - అందుకే భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుంది!
Solar Eclipse Today March 29 2025: మార్చి 29 శనివారం అమావాస్య, సూర్య గ్రహణం మనకు కనిపిస్తుందా? నియమాలు పాటించాలా? మీ రాశిపై సూర్యగ్రహణం ప్రభావం ఎంత

Solar Eclipse Timings: మార్చి 29 పాక్షిక సూర్యగ్రహణం - ఫాల్గుణ బహుళ అమావాస్య 29-3-2025
శనివారం రాహుగ్రస్త పాక్షిక సూర్య గ్రహణం. ఈ గ్రహణం బెర్ముడా పోర్చుగల్, కెనడా, USA, మెరాకో, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఐస్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్, ఫారోదీవులు, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్. న్లాండ్, రష్యా, హంగేరీ, ఇటలీ, ఫోలాండ్, రొమేనియా, ఉక్రెయిన్, వెనిజులా వాటికన్సిటీ, దేశాల్లో కనిపిస్తుంది. మన దేశంలో ఎక్కడా కనిపించదు. అందుకే నియమాలు పాటించాల్సిన అవసరం లేదు.
భాద్రపదమాసం, ఫాల్గుణమాసంలో పూర్ణిమకు చంద్రగ్రహణం, అమావాస్యకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆయా దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు, ఆ దేశపాలకులకు నష్టాలు, దుస్సంఘటనలు , వాహ విమాన ప్రమాదాలు, దేశాలమధ్య యుద్ధాలు జరుగుతాయి. రిక్టర్ స్కేల్పై 6.5 దాటి ఉంటుంది
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల సంవత్సర ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
షష్టగ్రహకూటమితో సూర్యగ్రహణం ఏర్పడుతోంది..మీనరాశి, ఉత్తరాబాధ్ర నక్షత్రంలో ఏర్పడనుంది. సూర్యుడు, రాహువు, శుక్రుడు, బుధుడు చంద్రుడు,శని మీనరాశిలో సంచరిస్తున్నారు. ఆ షష్టగ్రహకూటమి సూర్యగ్రహణం రోజు ఏర్పడటంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తామని పండితులు చెబుతున్నారు. భూకంపాలు, వరదలు, సునామీలు , విమాన ప్రమాదాలు జరుగుతాయి కానీ ప్రాణనష్టం ఉండదు. రాజకీయ గందరగోళం, అస్థిరత , వివిధ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది. ఒకానొక సమయంలో ప్రపంచ యుద్దం వస్తుందా అనే అనుమానాలు కూడా కలుగుతాయి.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
మేష రాశి వారికి ఈ గ్రహణం ఒత్తిడి పెంచుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో డబ్బు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. అనారోగ్య సమస్యలుంటే నిర్లక్ష్యం చేయవద్దు.
వృషభ రాశి వారికి ఈ రాశివారికి సూర్య గ్రహణం శుభప్రదంగా ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది
మిథున రాశివారికి గౌరవం పెరుగుతుంది. పదోన్నతికి సంబంధించిన సమచారం అందుకుంటారు
కర్కాటక రాశి వారికి వృత్తి, వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత వస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఇదే సరైన సమయం
సింహ రాశి వారికి వ్యక్తిగత జీవితంలో గందరగోళం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం వద్దు
కన్యా రాశివారికి సాధారణ ఫలితాలున్నాయి. మీ లక్ష్యాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
తులా రాశివారు అనాలోచిత నిర్ణయాలు తీసుకుని చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి
వృశ్చిక రాశి వారికి ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి.
ధనస్సు రాశివారికి సహనం అవసరం..ఆచితూచి అడుగేయాలి
మకర రాశివారికి ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఈ గ్రహణం శుభఫలితాలు ఇస్తుంది
కుంభ రాశివారికి చికాకులు, వివాదాలు తప్పవు. ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం
మీన రాశివారిపై గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. నూతన ప్రాజెక్టులు వాయిదా వేయడమే మంచిది
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి






















