GoldJewelry: బంగారం కొనే ముందు ఈ నక్షత్రాలు చూడండి! శుభ ఫలితాలనిచ్చే ముహూర్తాలు, రహస్యాలు తెలుసుకోండి!
Shubh Nakshatra for buying Gold jewelry: ఏదైనా శుభ కార్యానికి సరైన సమయం శుభ ముహూర్తంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు..అయితే బంగారం, ఆభరణాలు కొనేటప్పుడు కూడా శుభ నక్షత్రాన్ని పరిగణించాలని మీకు తెలుసా?

Gold jewelry: హిందూ జ్యోతిషశాస్త్రం ఏదైనా శుభ కార్యానికి సరైన సమయం , శుభ ముహూర్తాన్ని సూచిస్తుంది. ఆభరణాల తయారీ కూడా ఆ కార్యకలాపాలలో ఒకటిగా పరిగణిస్తారు. జ్యోతిష్యశాస్త్ర గ్రంథాల ప్రకారం, సరైన నక్షత్రం, శుభ సమయంలో తయారు చేసిన ఆభరణాలు మరింత శుభప్రదమైనవి , ప్రయోజనకరమైనవిగా పరిగణిస్తారు.
పురాతన జ్యోతిష్య గ్రంథం ముహూర్త చింతామణి ప్రకారం కొన్ని నక్షత్రరాశులను ఆభరణాల తయారీకి లేదా చేతిపనులకు శుభప్రదంగా భావిస్తారు. శుభ నక్షత్రాల సమయంలో బంగారం కొనడం లేదా చేతిపనులు చేయడం వల్ల దీర్ఘకాలిక ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.
ఏ రాశులలో ఆభరణాలు తయారు చేసుకోవడం శుభప్రదం?
గ్రంధాల ప్రకారం, చర, క్షిప్రా , ధ్రువ నక్షత్రాలలో నగల తయారీ శుభప్రదంగా పరిగణిస్తారు. వీటిలో స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం ఉన్నాయి. ఇంకా, హస్త, అశ్విని, పుష్య, అభిజిత్ నక్షత్రాలు కూడా నగల తయారీకి తగినవిగా పరిగణిస్తారు.
ధ్రువ నక్షత్రరాశులలో రోహిణి... మూడు ఉత్తర నక్షత్రరాశులు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినవిగా చెబుతారు. ఈ నక్షత్రరాశుల సమయంలో తయారు చేసిన ఆభరణాలు శుభ ఫలితాలను ఇస్తాయి.

రత్నాల ఆభరణాలకు శుభ సమయం?
మీరు మీ ఆభరణాలలో రత్నాలను పొందుపరచాలనుకుంటే ఆదివారం , మంగళవారం.. మేషం , సింహం, వృశ్చిక లగ్నాల్లో రత్నాల ఆభరణాలను తయారు చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.
ముత్యాలు పొదిగిన ఆభరణాలకు శుభ సమయం?
చర, ధ్రువ, మృదు, క్షిప్ర నక్షత్రరాశులు ముత్యాల ఆభరణాలకు అనుకూలమైనవిగా భావిస్తారు. ఈ నక్షత్రరాశుల సమయంలో శుభ లగ్న లగ్నంతో ఆభరణాలు తయారు చేయడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆయుధ తయారీకి ప్రస్తావించిన ప్రత్యేక నక్షత్రరాశులు
హిందూ మత గ్రంథాలు ఆయుధాల తయారీకి కొన్ని నక్షత్రరాశులను శుభప్రదంగా భావిస్తాయని చెబుతున్నాయి. అశ్విని, మృగశిర, విశాఖ, కృత్తిక వంటి నక్షత్రరాశులలో ఆయుధాల తయారీ కూడా శుభప్రదంగా చెబుతారు

సాంప్రదాయ విశ్వాసాలు
జ్యోతిష్య శాస్త్రంలో సమయం , నక్షత్రరాశులకు గొప్ప ప్రాముఖ్యత ఇస్తారు. సరైన సమయంలో చేసే పని మరింత విజయవంతమవుతుందని శుభప్రదంగా ఉంటుందని నమ్ముతారు. అయితే, ఈ నమ్మకాలను సాంప్రదాయ జ్యోతిషశాస్త్ర దృక్పథం నుంచి చూస్తారు.
గురువారం - పుష్యమి నక్షత్రం కలసిన రోజున ఆభరణాలు కొనుగోలు చేయడం శుభప్రదం
శనివారం రోజు ఆభరణాలు కొనుగోలు చేయరు...లోహం శనితో సంబంధం ఉందని విశ్వాసం.. అందుకే శనివారం రోజు లోహాలకు సంబంధించిన ఏ వస్తువులు కొనుగోలు చేయరు
శుభప్రదమైన సమయంలో బంగారం కొనుగోలు చేయడం, ధరించడం చేస్తే..శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
ఉగాది 2026 పరాభవ నామసంవత్సరంలో మీ రాశి ఆదాయం - వ్యయం తెలుసుకోండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
























