Tanikella Bharani: నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
Tanikella Bharani New Movie: నూతన నటీనటులకు ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఆహ్వానం పలికారు. తాను డైరెక్ట్ చేయబోయే మూవీలో న్యూ టాలెంట్‌ను తీసుకోబోతున్నట్లు చెప్పారు.

Tanikella Bharani Casting Call For His New Movie: మీకు నటనలో ఇంట్రెస్ట్ ఉందా?. అయితే ఈ ఛాన్స్ మీకోసమే. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి (Tanikella Bharani) తన కొత్త మూవీలో నూతన నటీనటుల కోసం ఆహ్వానం పలికారు. ఉగాది సందర్భంగా ఆ వివరాలను ప్రకటించారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆయన మెగా ఫోన్ పట్టనున్నారు.
నూతన నటీనటుల కోసం..
తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల కోసం న్యూ టాలెంట్ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న 8 మందిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న వారు తమ వివరాలను 'sivasubrahmanyam.23@gmail.com' కు మెయిల్ గానీ, 8897496143, 9701522123 వాట్సాప్ నెంబర్లకు గానీ పంపాలని సూచించారు.
Also Read: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
'మిథునం' తర్వాత డైరెక్టర్‌గా..
రచయిత, నటుడిగా తనికెళ్ల భరణి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన శివునికి సంబంధించి చేసిన పలు ఆల్బమ్స్ సైతం ప్రాచుర్యం పొందాయి. ఎన్నో చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్‌లో అప్పటి తరం నుంచి ఇప్పటి వరకూ టాప్ హీరోలతో నటించి మెప్పించారు. రచయిత, నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ సత్తా చాటారు. 'సిరా' అనే షార్ట్ ఫిల్మ్‌తో పాటు లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రల్లో 'మిథునం' మూవీని రూపొందించారు. ఈ మూవీ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఈ మూవీకి బెస్ట్ డైలాగ్ రైటర్‌గా తనికెళ్ల భరణి నంది అవార్డు అందుకున్నారు. మరో 3 నంది అవార్డులు సైతం ఈ మూవీకి దక్కాయి.
మరోవైపు, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందుతోన్న 'కథా సుధ'లో తనికెళ్ల భరణి నటిస్తున్నారు. 'కథా సుధ' పేరిట ప్రతీ ఆదివారం ఓ కొత్త కథతో 'ఈటీవీ విన్' ఓటీటీలో ఈ స్టోరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఏప్రిల్ 6 నుంచి ఇవి అందుబాటులో ఉండనున్నాయి. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నూతన నటీనటులను పరిచయం చేయనున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆయనతో పరిచయం తన అదృష్టమని భరణి చెప్పారు. దీని నుంచి భవిష్యత్తులో చాలామంది దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతారని అన్నారు.






















