Horoscope Today : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది రోజు మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 30 ఆదివారం ఉగాది రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. విదేశాలలో నివసించే వారు ఇంటికి తిరిగి రావాలనే ఆలోచన చేస్తారు. వ్యాపారంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతారు.
వృషభ రాశి
ఈ రోజు మీకు శుభఫలితాలున్నాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది దగ్గరి వ్యక్తులు మీ నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. ఆకస్మిక డబ్బు ప్రయోజనాలు ఉండవచ్చు.
మిథున రాశి
ఈ రోజు మీతీరు ప్రభావితం చేసేలా ఉంటుంది. చలనచిత్ర,ఇతర లలిత కళలతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆదాయం పెరగవచ్చు. విదేశాలలో ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారికి ఈ రోజు అనుకూల ఫలితాలు పొందుతారు. మీరు కుటుంబ సభ్యుల కోసం బహుమతులు కొనుగోలు చేయవచ్చు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల సంవత్సర ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశివారు వ్యాపారంలో ఊహించిన విధంగా ఫలితాలు లేకపోవడం వల్ల కొంత నిరాశ ఉంటుంది. కానీ ఈ సమయంలో మీరు కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు.మీ మనస్సును స్నేహితులతో పంచుకోవచ్చు. మీరు ఇబ్బందులకు పరిష్కారం పొందే అవకాశం ఉంది.
సింహ రాశి
ఈ రోజు మీరు అకస్మాత్తుగా పెద్ద ఆర్డర్‌ను పొందవచ్చు. జీవిత భాగస్వామితో చికాకులుంటాయి. నూతన ఒప్పందాలు పెట్టుకోవద్దు. ఇంటా బయటా గౌరవం కాపాడుకోవడం మంచిది. అనవసర ఒత్తిడికి గురికావొద్దు.
కన్యా రాశి
ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. అన్ని పనులు మంచి వేగంతో కొనసాగుతాయి. వ్యాపారంలో ఈహించిన దానికంటే ఎక్కువ పొందుతారు. ప్రజలు మీ పనిని ప్రశ్నిస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత స్థానం పొందవచ్చు.
తులా రాశి
ఈ రోజు మీరు చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మానసికంగా చాలా బలంగా ఉంటారు. స్వేచ్ఛగా పనిచేయడానికి ఇష్టపడతారు. మీరు సామాజిక ప్రయోజనాల రచనల్లో పాల్గొంటారు. ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికందుతుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ జీవిత భాగస్వామితో మీ ప్రవర్తనను మంచిగా ఉంచాలి. మీ పనితీరును మార్చుకునేందుకు ప్రయత్నించండి. స్నేహితుల సలహాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
ధనస్సు రాశి
ఈ రోజు కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తారు. వివావాహానికి సంబంధించిన చర్చలు కుటుంబంలో జరుగుతాయి. కుటుంబ సభ్యులు మీకు సహాకరంగా ఉంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆనందంగా ఉంటారు
మకర రాశి
ఈ రోజు మీరు తీవ్ర విశ్వాసంతో ఉంటారు. మీ బలహీనతలు అధిగమించడం మంచిది. అయితే చట్టపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో ఇబ్బందిపడతారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.
కుంభ రాశి
కుంభ రాశివారికి ఈరోజు అనారోగ్య సమస్యలుంటాయి. వ్యాపారాల్లో మంచి లాభాలుంటాయి. ఇంటి నిర్వహణ కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మిమ్మల్ని గౌరవించని వ్యక్తుల ముందు మాట్లాడకండి...అవమానాలు ఎదుర్కొంటారు
మీన రాశి
క్షీణిస్తున్న సంబంధాలను మెరుగుపరచడానికి ఈ రోజు ప్రయత్నిస్తారు. మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచించి ఆందోళన చెందుతారు. మీరు మతపరమైన విషయాల గురించి ఆలోచిస్తారు. విద్యార్థులు అధ్యయనాలలో అడ్డంకిని ఎదుర్కోవలసి ఉంటుంది. కన్నవారి ఆశీర్వాదాలు మీపై ఉంటాయి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















