అన్వేషించండి

Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా

P4 in Andhra Pradesh | రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కూటమి ప్రభుత్వం పీ4 విధానాన్ని ఉగాది పండుగ సందర్భంగా ప్రారంభించింది. దీని లోగోను పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు ఆవిష్కరించారు.

AP CM Chandrababu | అమరావతి: పేదలను ఆదుకునే మిషన్ పీ4 అని, ఈ కార్యక్రమం గేమ్ ఛేంజర్ అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. పీ4 అనే చరిత్ర సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రాజధాని అమరావతిలో ఆదివారం పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లోగోను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)తో కలిసి ఆవిష్కరించిన చంద్రబాబు అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 

దేశంలో ఎవరికీ దక్కని గౌరవం
ఉగాది రోజున ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుంది. అందుకే పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన పీ4 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచించే పవన్ కళ్యాణ్, భారత్ దేశాన్ని అగ్రదేశంగా మార్చే మోదీతో కలిసి ప్రభుత్వంలో ఉన్నాం. నేను ఎక్కడా నా గురించి ఎక్కువగా చెప్పుకోను. 1978లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను. మరో 3 ఏళ్లు ఉంటే నేను తొలిసారి ఎమ్మెల్యే అయ్యి 50 ఏళ్లు అవుతుంది. 5 దశాబ్దాలుగా నన్ను ఆదరిస్తున్న మీకే నా జీవితం అంకితం. 9 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు సీఎం అయ్యాను. 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా, 30 ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. దేశంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. అది ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజానీకమే. నా ప్రస్థానాన్ని చూసుకంటే గుండె ఉప్పొంగుతోంది. 

ఎన్టీఆర్ క్రమశిక్షణలో పెరిగాను
ఎన్టీఆర్ క్రమశిక్షణకు మారుపేరుతో పాటు పట్టుదల ఉన్న వ్యక్తి. అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. ఎన్టీఆర్ కఠోర క్రమశిక్షణలో పెరిగాను. 47 ఏళ్లుగా ప్రజలే జీవితంగా బతుకుతున్నాను. ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నాను. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చి నిజాయితీ, అవినీతి రహిత పాలన అందించడమే నాకు తెలిసిన విషయాలు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాల్లో మార్పులు రావాలని అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాను. ప్రజల వద్దకే పాలన, జన్మభూమి, ఐటీ విప్లవాన్ని తెచ్చాను. పని తప్ప నాకు మరొకటి తెలియదు...మరో అలవాటు లేదు. నిద్రలేవగానే ప్రజలకు ఏం చేస్తే జీవితాల్లో మార్పు వస్తుందో ఆలోచిస్తాను. రాత్రి పడుకునేటప్పుడు ఈ రోజు ఏం చేశాను, ఎంత మేలు జరిగిందని ఆలోచించి పడుకుంటాను.


Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
తప్పు చేయలేదు, చేయను..
నేను ఎప్పుడూ తప్పు చేయలేదు, చేయను. నాకు ఒక కుటుంబం ఉంది. నా కుటుంబానికి రాజకీయాల ద్వారా జీవనోపాధి ఉండకూడదని ఆలోచించి హెరిటేజ్ సంస్థ పెట్టి నా కుటుంబ సభ్యులకు అప్పగించాను. వారు నామీద ఆధార పడరు... నేనే వారిమీద ఆధార పడతున్నాను. కుటుంబానికి ఆర్థిక స్వావలంబన ఉంటే ధైర్యంగా ఉంటాం. ఆ ధైర్యమే నన్ను ఇప్పుడు నడిపిస్తోంది. నా సతీమణి భువనేశ్వరికి వ్యాపారాలు తెలియవు, వ్యాపారంలోకి నేను వెళ్లనని చెప్పారు. నేను మంత్రిగా, రాజకీయాల్లో ఉన్నాను, నువ్వు వెళ్లకుంటే ఇబ్బందులు వస్తాయని చెప్తే హెరిటేజ్ సంస్థను నిర్వహించారు. అప్పటికి  లోకేష్ చిన్న వయసులో ఉండి చదువుకుంటున్నారు. 

మేటైన నగరంగా అమరావతి
టీడీపీ కార్యకర్తలు చాలా మంది ఇబ్బంది పడ్డారు, ప్రాణాలు కోల్పోయారు. నా కోసం జండా మోసే కార్యకర్తలు చనిపోయారు, వారి పిల్లలు అనాథలు అయ్యారని ఆలోచించి ట్రస్ట్ ఏర్పాటు చేసి చదివించి ప్రయోజకులను చేశాం. దీంతో వారి జీవితాలు బాగుపడ్డాయి. స్కూల్‌కు వెళ్లి వారితో గడిపాను..జీవితంలో ఏం అవుతామని అడిగేవాడిని. మా నాన్నను చంపిన వారిని చంపిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పేవారు. చంపిన వారు వారి పాపాన వారు పోతారు, మీరు కూడా ఆపని చేస్తే జైలుకు వెళ్తారు అని చెప్పి చదివించాను.  ఈ రోజు బ్రహ్మాండంగా జీవితంలో సెటిల్ అయ్యారు. 

1991లో మన తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు సంస్కరణలు తెచ్చి దేశ దశదిశ మార్చారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక  మానవతా దృక్పధంతో పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారులు ఒక చిన్న ఆలోచన నుంచి వచ్చాయి. 2 కోట్ల జనాభా ఉన్న మలేషియా చిన్నదేశం. 8 వరుసల రహదారులు ఉన్నాయి. మనదేశం చాలా పెద్దది, మనకు హైవేలు లేవు అని నాటి ప్రధానికి చెప్పాను. ఎలా చేద్దామంటే నాకొదిలిపెట్టమి చెప్పి, నెల్లూరు నుంచి చెన్నైకి రోడ్డు వేశాం. నేడు దేశంలో రహదారుల దశ మారింది. విద్యుత్, ఎయిర్ పోర్టు, టెలీ కమ్యునికేషన్ లో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ధనికులకే ఫోన్లు ఉండేవి. ఐటీ తీసుకొచ్చాక గ్రామాల్లో వ్యవసాయం చేసే రైతు, రైతు కూలీలు పిల్లలు నేడు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అమరావతి కూడా ప్రపంచంలో మేటైన నగరంగా తయారవుతుంది.  

పాలనను గాడిన పెట్టాం
గాడి తప్పిన పాలనను గాడిన పెట్టాం. నేను, పవన్ కళ్యాణ్, కేంద్రం రాష్ట్రంపై శ్రద్ధ పెట్టి పునర్ నిర్మాణమే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. గాడితప్పిన అమరావతిని గాడిన పెట్టాం. కేంద్రం చొరవతో పోలవరంను 2027కే పూర్తి చేస్తాం. విశాఖకు రైల్వే జోన్ తెచ్చాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకుండా కేంద్రం ఆర్థిక సాయం అందించింది. ఎన్నికల్లో కూటమిని 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో గెలిపించారు. మీరు గెలిపించిన సీట్లు రాష్ట్ర అభివృద్ధికి సంజీవనిగా పని చేస్తున్నాయి. 1995లో ఐటీ గురించి మాట్లాడాను...ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, ఏఐ గురించి మాట్లాడుతున్నా. ఇవి సంసద సృష్టించడానికి ఉపయోగపడతాయి. తెలుగుజాతి బాగుండాలనేది నా కోరిక. తెలుగుదేశం పార్టీ తెలుగుజాతి కోసం పుట్టిన పార్టీ. 

పేదలను ఒకదారికి తీసుకొస్తా
పేదల జీవితాలను ఒకదారికి తీసుకొచ్చే వరకు నా ప్రయత్నాన్ని వదిలిపెట్టను. ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చింది. డ్వాక్రా సంఘాలు పెట్టి పొదుపు ఉద్యమం నేర్పించాను. మహిళలు ఇబ్బందులు పడకూడదని ఉచితంగా సిలిండర్లు అందించాను...ఇప్పుడు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఆడపిల్లకు విద్యలో 33 శాతం రిజర్వేషన్లు తెచ్చాం. ఈ రోజు ఆడబిడ్డల ఆదాయమే అధికంగా ఉంటోంది. ఆర్టీసీ బస్సుల్లో కండెక్టర్లుగా అవకాశం కల్పించాం. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. 

నా జీవితానికి ఎన్టీఆరే ఆదర్శం
బిల్ గేట్స్ ఇంటర్నెట్ రెవెల్యూషన్ తీసుకొచ్చారు. ఆయన ఒకస్థాయికి వచ్చాక ప్రజాసేవ ముఖ్యం అని గేట్స్ ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ కూడా తన సంపాదనలో కొంత డబ్బును సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు. విప్రో అధినేత ప్రేమ్ జీ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా సీఎస్ఆర్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తోంది. స్ఫూర్తి దాత అంబేద్కర్‌ చదువుకునేందుకు ఆనాడు అనుకూల పరిస్థితులు లేవు. అంటరాని తనం, అవమానాన్ని ఎదుర్కొన్నారు.. కానీ పట్టుదల వదులుకోలేదు. అంబేర్కర్ మేథో శక్తిని గుర్తించి షాయాజీరాజ్ మహరాజ్ అండగా నిలిచి ఆర్థిక సాయం చేశారు. లండన్ వెళ్లి చదువుకోవాలంటే నెలకు 12 డాలర్లు ఇచ్చారు. తిరిగి వచ్చాక అకౌంట్ జనరల్ కార్యాలయంలో ప్రొబేషన్ గా పెట్టుకున్నారు. న్యాయవాదిగా, ఆర్థిక వేత్తగా, సామాజిక సంస్కర్తగా, భారత రాజ్యాంగాన్ని రాసి భవిష్యత్ తరాలకు ఏం కావాలో నిర్ధేశించిన వ్యక్తిగా అంబేద్కర్ ఎదిరగారు. 
షాయాజీరాజు చేసిన సాయం అంబేద్కర్ ఎదుగుదలకు ఉపయోగపడింది.  మాజీరాష్ట్రపతి అబ్దుల్ కలాం విశిష్టమైన వ్యక్తి. దేశం గర్వించేలా మిస్సైల్ కనిపెట్టారు.  ముస్లింలు, బ్రాహ్మణులు కలిసి భోజనం చేయకూడదని ఆనాడు మూఢనమ్మకాలు ఉన్నాయి. కానీ రామేశ్వరంలో ఉన్న శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అబ్దుల్ కలాంను దగ్గరకు తీసుకుని సూచనలు ఇచ్చి ఆదరించారు. ఈ మాటలను లబ్దుల్ కలాం ఆయన పుస్తకంలో పొందుపరిచారు. వివేకానంద వెనక రామకృష్ణ పరమహంస ఉన్నారు. వివేకా గుణాన్ని అద్యయం చేసిన రామకృష్ణ బోధనలు చేసి, ఆధ్యాత్మిక విద్యను నేర్పించారు. ప్రపంచానికే సందేశం ఇచ్చి ప్రపంచం మెచ్చిన నేతగా వివేకానంద ఎదిగారు. నాడు ఎన్టీఆర్ లేకపోతే నేను కూడా సాధారణ వ్యక్తిని అయ్యేవాన్ని. ఆయన దగ్గర నేర్చుకున్న పట్టుదల, క్రమశిక్షణ, దగ్గరకు చేర్చిన విధానం నా జీవితంలో మర్చిపోలేను. నా జీవితానికి ఎన్టీఆర్ ఆదర్శం.
 
ఆదరణ లేక రాణించలేక
తెలివితేటలు ఉన్నా ఆదరణ లేక రాణించలేకపోయారు. మనతో పుట్టిన మన బంధువులే పేదరికంలో ఉండి చదువుకోలేకపోతున్నారు. అలాంటి వారిని ఆదుకోవాలి.  సంపాదించుకున్న ఆస్తులను చనిపోయినప్పుడు తీసుకెళ్లలేరు. మంచిపని చేశామా, స్వార్థంతో బతికామా అన్నదే మనం చనిపోయిన తర్వాత మిగిలిపోతాయి. మీ శక్తిని ఉపయోగించి ప్రజల జీవితాల్లో వెలుగు తెస్తే దాని వల్ల వచ్చేతృప్తి మరొకదానిద్వారా రాదు.  మన పిల్లల్ని, తెలుగజాతిని తెలివైన వారిగా మార్చితే వారే డబ్బులు సంపాదిస్తారు. అందరికీ ఇల్లు, కరెంట్, నెట్, నీళ్లు, మరుగుదొడ్డి, గ్యాస్ సదుపాయాలు అందిస్తాం.  నన్ను 4 సార్లు సీఎం చేసిన ఈ సమాజం బాగుకోసం ఆలోచిస్తున్నా. ఈ కార్యక్రమం ఒక గేమ్ ఛేంజర్. 

ఆగస్టు 15కు ఒకరూపానికి తీసుకొస్తాం
స్వర్ణాంధ్ర విజన్-2047 రూపొందించాం. గతేడాది తలసరి ఆదాయం రూ.2,66,995 ఉంటే ఈ యేడాది రూ.2,98,065 ఉంది. 2028-29 నాటికి రూ.5,42,985 అవుతుంది. 2047 నాటికి రూ.55 లక్షలకు పెరుగుతుంది. ఇవన్నీ సాధ్యం కావాలంటే ప్రజల్లో కూడా ఆలోచన రావాలి. 2047 నాటికి భారతదేశం అగ్రదేశంగా ఉంటుంది. అందులో మన తెలుగుజాతి అగ్రభాగాన ఉండాలన్నది నా తపన. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి. పెరిగిన ఆదాయాన్ని సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు చేయాలి. నేను అనుకున్న ఏ ప్రణాళికా ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వలేదు. మార్గదర్శులు దత్తత తీసుకున్న వారి కుటుంబాల పరిస్థితి డ్యాష్ బోర్డు ద్వారా సమీక్షిస్తాను. ఆగస్టు 15కు దీన్ని ఒక రూపానికి తీసుకొస్తాం. వచ్చే ఉగాదికి సాధించిన ప్రగతి కూడా మీ ముందు పెడతాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.  

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Durgam Lake Encroachment Case: దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
BRS Assembly Boycott: బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ - అసెంబ్లీని గాంధీభవన్‌లా నిర్వహిస్తున్నారని ఆగ్రహం
బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ - అసెంబ్లీని గాంధీభవన్‌లా నిర్వహిస్తున్నారని ఆగ్రహం
Maoists Surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durgam Lake Encroachment Case: దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
BRS Assembly Boycott: బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ - అసెంబ్లీని గాంధీభవన్‌లా నిర్వహిస్తున్నారని ఆగ్రహం
బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ - అసెంబ్లీని గాంధీభవన్‌లా నిర్వహిస్తున్నారని ఆగ్రహం
Maoists Surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ కు షాక్.. వీడియో కోసం ఇన్ స్టాగ్రామ్‌కు లేఖ రాసిన పోలీసులు
యూట్యూబర్ అన్వేష్ కు షాక్.. వీడియో కోసం ఇన్ స్టాగ్రామ్‌కు లేఖ రాసిన పోలీసులు
IndiGo Flights Diverted: శంషాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
IndiGo Flights Diverted: శంషాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
Team India schedule 2026: ఈ ఏడాది టీమిండియా పూర్తి షెడ్యూల్ చూశారా.. కీలకంగా టీ20 వరల్డ్ కప్
ఈ ఏడాది టీమిండియా పూర్తి షెడ్యూల్ చూశారా.. కీలకంగా టీ20 వరల్డ్ కప్
Shanmukh Jaswanth : ప్రియురాలిని పరిచయం చేసిన షణ్ముఖ్ జశ్వంత్? - గాడ్స్ ప్లాన్ అంటూ పోస్ట్... ఆమె ఎవరు?
ప్రియురాలిని పరిచయం చేసిన షణ్ముఖ్ జశ్వంత్? - గాడ్స్ ప్లాన్ అంటూ పోస్ట్... ఆమె ఎవరు?
Embed widget