RR vs CSK Match Highlights IPL 2025 | చెన్నై పై 6 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం | ABP Desam
చెపాక్ లో ఆర్సీబీ మీద ఓడిపోయి సొంత ఫ్యాన్స్ నుంచే విమర్శలు ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ అస్సాం వెళ్లి అదే అస్సాం ఆటను కొనసాగించింది. గువహాటిలో రాజస్థాన్ రాయల్స్ విసిరిన 183పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేయటానికి అపసోపాలు పడి చివరకు దగ్గర వరకూ వచ్చిన మళ్లీ మ్యాచ్ ను లూజ్ చేసుకుని 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చేతిలో ఉన్న మ్యాచ్ ను రాజస్థాన్ కు చెన్నై సమర్పించేసుకున్న ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. నిలబెట్టి బాదిన నితీశ్ రానా
టాస్ గెలిచి బ్యాటింగ్ ను రాజస్థాన్ కి అప్పగించిన చెన్నై అనుకున్నట్లగానే మొదటి ఓవర్ లోనే యశస్వి జైశ్వాల్ వికెట్ తీసింది. కానీ మరో ఓపెనర్ సంజూ శాంసన్, టూ డౌన్ లో కెప్టెన్ రియాన్ పరాగ్ తో కలిసి నితీశ్ రానా పోరాడాడు. కేవలం 36 బాల్స్ మాత్రమే ఆడినా 10 ఫోర్లు 5 భారీ సిక్సర్లతో 81 పరుగులు చేసి..అశ్విన్ బౌలింగ్ లో ధోని స్టంపౌట్ చేయటంతో వెనుదిరిగాడు.
2. చెన్నై బౌలర్ల సమష్ఠి కృషి
వికెట్లు పడుతున్నా మధ్యలో పరుగులు లీక్ అవుతున్నా మళ్లీ వికెట్లు తీస్తూ రాజస్థాన్ ను భారీ స్కోరు చేయనివ్వకుండా అడ్డుకున్నారు చెన్నై బౌలర్లు. ఇందుకోసం బౌలర్లంతా సమష్ఠిగా పోరాడారు. ఖలీల్ అహ్మద్ చెన్నైకు కావాల్సిన ఆరంభం ఇస్తే...నూర్ అహ్మద్, పతిరానా కీలక వికెట్లను పడగొట్టారు. కెప్టెన్ సంజూను, ధృవ్ జురెల్ ను నూర్ అహ్మద్ అవుట్ చేస్తే..కెప్టెన్ రియాన్ పరాగ్ ను క్లీన్ బౌల్డ్ చేయటంతో పాటు ప్రమాదకర హెట్మెయర్ వికెట్టూ తీశాడు మతీషా పతిరానా. జడ్డూ, అశ్విన్ కూడా తలో వికెట్ తీయటంతో రాజస్థాన్ రాయల్స్ 182పరుగులకు కట్టడి చేయగలిగింది.
3. కెప్టెన్ గైక్వాడ్ షో
183 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ మొదటి ఓవర్లోనే రచిన్ రవీంద్ర వికెట్ కోల్పోయింది. అయితే రాహుల్ త్రిపాఠీ, శివమ్ దూబే అండగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కే బోర్డును నిలబెట్టాడు.44 బాల్స్ లో 7 ఫోర్లు ఓ సిక్సర్ తో 63పరుగులు చేశాడు. హసరంగ బౌలింగ్ లో అవుట్ అవ్వటంతో చెన్నై మళ్లీ కష్టాల్లో పడింది.
4. ఆశలు రేపిన జడ్డూ ధోనీ
రుతురాజ్ అవుట్ అయ్యేప్పటికీ 4 ఓవర్లలో 53 పరుగులు చేయాలి. ఆ దశలో జడ్డూకు జత కలిసిన ధోనీ కాసేపు చెన్నై శిబిరంలో ఆశలు కల్పించారు. ధోనీ 11 బాల్స్ లో ఓ ఫోర్, ఓసిక్సర్ తో 16పరుగులు చేయగా..హెట్మెయర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో అవుటైపోయాడు. జడేజా 22 బాల్స్ లో 2 ఫోర్లు ఓ సిక్సర్ తో 32 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నా టార్గెట్ ఫినిష్ చేయలేని పరిస్థితి.
5. వనిందు హసరంగా మ్యాజిక్
ఈ మ్యాచ్ చెన్నై ఓడిందన్నా..రాజస్థాన్ గెలిచిందన్నా ఒక్కడే తేడా. తనే RR స్పిన్నర్ వనిందు హసరంగ. ఓవర్ వేసిన ప్రతీసారి వికెట్ తీసి చెన్నైను ఉక్కిరి బిక్కిరి చేశాడు హసరంగ. మొదటి ఓవర్ లో త్రిపాఠీని, రెండో ఓవర్ లో శివమ్ దూబేను, మూడో ఓవర్ లో కెప్టెన్ విజయ్ శంకర్ ను, నాలుగో ఓవర్ లో కెప్టెన్ గైక్వాడ్ ను అవుట్ చేసి చెన్నై కథ ముగించాడు హసరంగ. 4 ఓవర్లలో 35 రన్స్ ఇచ్చి 4 వికెట్లు సాధించిన హసరంగ చెన్నై 176పరుగులే చేసేలా చేసి రాజస్థాన్ కు 6 పరుగుల తేడాతో విక్టరీని అందించాడు హసరంగ.



















