అన్వేషించండి

Ugadi Pachadi : ఉగాది పచ్చడి తయారీ రెసిపీ.. ఈ ట్రెడీషనల్​ డిష్​లోని పోషకాలు ఇవే, ఎన్ని కేలరీలు ఉంటాయో తెలుసా?

Ugadi 2025 : ఉగాదికి కచ్చితంగా అందరి ఇళ్లల్లో ఉండే డిష్ ఉగాది పచ్చది. ప్రాంతాల వారీగా దీనిని చాలామంది డిఫరెంట్​గా చేసుకుంటారు. మరి దీనిలోని పోషకాలు ఏంటో ఓసారి చూసేద్దాం.

Ugadi Pachadi Recipe : ఉగాది 2025 వచ్చేసింది. ఈ సమయంలో ఫ్రెండ్స్, ఫ్యామిలీకి శుభాకాంక్షలు చెప్తారు. ఇంట్లో పూజ చేసుకుంటారు. ఉగాది పచ్చడిని ఇచ్చి, పుచ్చుకుని వేడుకలా జరుపుకుంటారు. అలాగే నైవేద్యంగా కూడా పెడతారు.అసలు ఉగాది పచ్చడిని ఎలా తయారు చేస్తారు.. దానిలోని పోషకాలు ఏంటి? దానిలో కేలరీలు ఎన్ని ఉంటాయి.. ఆరోగ్యానికి అందించే లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

ఉగాది పచ్చడి.. 

తీపి, పులుపు, ఉప్పు, కారం, మసాలా, చేదు వంటి విభిన్న రుచులను కలిగి ఉంటుంది. ఇది జీవితంలోని పలు ఎమోషన్స్​ని ఇండికేట్ చేస్తుంది. ఆనందం, విచారం, కోపం, అసహ్యం, భయం, ఆశ్చర్యాలను ఇది సూచిస్తుంది. సెలబ్రేషన్స్ ఆఫ్ లైఫ్​ని తెలుపుతుంది. 
ఉగాది పచ్చడిని వేప పువ్వులు, పచ్చి మామిడికాయ, బెల్లం, మిరియాల పొడి, కొబ్బరి, ఉప్పుతో తయారు చేస్తారు. ప్రాంతాన్ని బట్టి దీనిలో స్వల్ప వైవిద్యాలు ఉంటాయి. కొందరు రుచిగా ఉండేందుకు ఈ ఉగాది పచ్చడిలో పుట్నాలు, జీడిపప్పు, ద్రాక్షలు, చెరుకు ముక్కలు, అరటిని కూడా వేసుకుంటారు. 

  • బెల్లం - తీపి రుచిని ఇస్తుంది. ఇది ఆనందాన్ని సూచిస్తుంది. 
  • వేప పువ్వు - వేప పువ్వును చేదు రుచిని కలిగి ఉంటుంది. ఇది విచారాన్ని సూచిస్తుంది. 
  • చింతపండు - పుల్లని రుచిని సూచిస్తుంది. ఇది అసహ్యాన్ని సూచిస్తుంది. 
  • మామిడి కాయ - ఘాటైన రుచితో ఉండి ఆశ్చర్యాన్ని ఇండికేట్ చేస్తుంది. 
  • ఉప్పు - ఉప్పు భయాన్ని సూచిస్తుంది. 
  • మిరియాల పొడి - ఇది కారం రుచిని ఇస్తుంది. కోపాన్ని ఇండికేట్ చేస్తుంది. 

మరి ఈ టేస్టీ ఉగాది పచ్చడి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో.. ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

నీరు - 1 ½ కప్పు 

పచ్చి మామిడికాయ - 2 టేబుల్ స్పూన్లు

వేప పువ్వులు - 1 టేబుల్ స్పూన్

ఉప్పు - చిటికెడు 

బెల్లం - 3 టేబుల్ స్పూన్లు 

మిరియాల పొడి - చిటికెడు

చింతపండు - 1 స్పూన్ 

ఆప్షనల్ 

అరటిపండు ముక్కలు, పుట్నాలు, జీడిపప్పు తురుము, ద్రాక్షలు కూడా తీసుకోవచ్చు. 

Also Read : ఉగాది స్పెషల్ పులిహోర రెసిపీ.. ఈ రెసిపీ ఫాలో అయితే రుచి అమోఘంగా ఉంటుంది

తయారీ విధానం 

చింతపండును కడిగి అరకప్పు గోరువెచ్చని నీటిలో నానబెట్టుకోవాలి. వేప పువ్వును కూడా సిద్ధం చేసుకోవాలి. కాడలను వేసుకోకూడదు. అలాగే పువ్వు రెక్కలను మాత్రమే తీసుకుంటే మంచిది. మరో కప్పులో నీటిలో తురిమిన బెల్లం వేసి కరిగిపోయే వరకు కలపండి. దీనిని ఫిల్టర్ చేసి పెట్టుకుంటే మంచిది. బెల్లంలోని మలినాలు రాకుండా ఉంటాయి. తరువాత మిక్సింగ్ బౌల్ తీసుకుని.. దానిలో ఈ పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. మీ రుచికి తగ్గట్లు పచ్చడిలోని రుచులను అడ్జెస్ట్ చేసుకోవాలి. అనంతరం దేవునికి నైవేద్యం పెట్టి.. అనంతరం మీరు ఆస్వాదించవచ్చు. 

ఉగాది పచ్చడిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. మీరు తీసుకున్న కొలతలకు ఒక చిన్న కప్పులో తీసుకుంటే 44 కేలరీలు ఉంటాయి. దీనిలో సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, చక్కెర, విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ ఉంటాయి. మీరు తీసుకునే ఫుడ్, ఇతర పదార్థాలకు అనుగుణంగా ఇవి మారుతూ ఉంటాయి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
Multani Mitti for Hair : ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
Embed widget