By: Arun Kumar Veera | Updated at : 29 Mar 2025 11:17 AM (IST)
పోస్టాఫీస్ పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ( Image Source : Other )
Post Office Small Savings Schemes: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పెట్టుబడిదార్లకు ఈసారి కూడా నిరాశ తప్పలేదు. PPF, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), సుకన్య సమృద్ధి యోజన (SSY), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) సహా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లలో (Interest rates for Post Office Small Savings Schemes) కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను వరుసగా అయిదో త్రైమాసికంలోనూ యథాతథంగా కొనసాగించింది.
సర్క్యులర్ జారీ
తాజా ప్రకటన ప్రకారం, పోస్టాఫీస్ పొదుపు పథకాలపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లనే 2025 ఏప్రిల్-జూన్ (2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం) కాలానికి కూడా కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వివరిస్తూ, 28 మార్చి 2025న ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి ఖాతా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ సహా చాలా రకాల పొదుపు పథకాల పెట్టుబడిదార్లను ప్రభావితం చేస్తుంది.
సర్క్యులర్ ప్రకారం, 2025 జూన్ 30 వరకు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంపై వడ్డీ రేటు 7.10% వద్దనే ఉంటుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 7.70% వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి ఖాతా పథకాలపై 8.20% చొప్పున వడ్డీ రాబడి కొనసాగుతుంది. వివిధ పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ల రేట్లు కాల వ్యవధిని బట్టి 6.90% నుంచి 7.50% వరకు ఉంటాయి.
ఏప్రిల్-జూన్ 2025 కాలానికి పొదుపు పథకాల వడ్డీ రేట్లు (Savings Schemes Interest Rates for April-June 2025):
పొదుపు పథకం | వడ్డీ రేటు |
పోస్టాఫీస్ పొదుపు ఖాతా | 4% |
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ | 6.7% |
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) | 7.4% |
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (1 సంవత్సరం) | 6.9% |
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (2 సంవత్సరాలు) | 7% |
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (3 సంవత్సరాలు) | 7.1% |
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (5 సంవత్సరాలు) | 7.5% |
కిసాన్ వికాస్ పత్ర (KVP) | 7.5% |
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) | 7.1% |
సుకన్య సమృద్ధి యోజన (SSY) | 8.2% |
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) | 7.7% |
సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (SCSS) | 8.2% |
చివరిగా ఎప్పుడు మార్చారు?
చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను చివరిసారిగా 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సవరించారు. ఆ సమయంలో, పోస్టాఫీస్ మూడు సంవత్సరాల టైమ్ డిపాజిట్లు & సుకన్య సమృద్ధి యోజనకు వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రేట్లలో ఎటువంటి సర్దుబాట్లు చేయలేదు, యథాతథంగా కొనసాగిస్తూ వచ్చింది. స్టాక్ మార్కెట్ పరిస్థితులు అస్థిరంగా ఉన్న నేపథ్యంలో, స్థిరమైన రాబడి అందించే పోస్టాఫీస్ పథకాలు ఆకర్షణీయంగా ఉంటాయి, ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మందిని ప్రోత్సహిస్తాయి.
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను శ్యామల గోపీనాథ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ప్రతి త్రైమాసికానికి (మూడు నెలలకు) ఒకసారి సమీక్షిస్తుంది. ఈ రేట్లు సంబంధిత మెచ్యూరిటీలతో కూడిన ప్రభుత్వ బాండ్ల రాబడితో పోలిస్తే 25 నుంచి 100 బేసిస్ పాయింట్ల పరిధిలో నిర్ణయించాలని కమిటీ సూచించింది. ఈ పద్ధతి వల్ల, చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి కాలంలో ప్రజలకు ఊరటనిస్తాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. "abp దేశం" ఎవరికీ, ఎప్పుడూ పెట్టుబడి సలహాలు ఇవ్వదు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.
Gold-Silver Prices Today 29 Mar: పసిడి మెరుపు పెరిగింది, వెండి వెనక్కు తగ్గింది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
ATM Withdrawal Fee: ATM నుంచి డబ్బు తీస్తే రూ.23 బాదుడు, తస్మాత్ జాగ్రత్త!
Canadian Salary: కెనడాలో C$30,000 జీతం సంపాదిస్తే భారత్‌లో దాని విలువ ఎంత? తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
Money Rules: ఏప్రిల్ నుంచి మీ చేతిలో డబ్బే డబ్బు! - మీ ఇష్టానికి ఖర్చు చేయొచ్చు
TDS, TCS New Rules: ఏప్రిల్ నుంచి టీడీఎస్-టీసీఎస్‌లో కీలక మార్పులు - విదేశాల్లో చదివేవాళ్లకు భారీ ఊరట
TDP Foundation Day: తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
Rashmika: ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్ క్రష్‌కు ముందే తెలిసిందా?
Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం