By: Arun Kumar Veera | Updated at : 28 Mar 2025 11:45 AM (IST)
టీడీఎస్, టీసీఎస్ భారం నుంచి ఉపశమనం ( Image Source : Other )
TDS, TCS New Rules from April 2025: కేంద్ర బడ్జెట్ 2025లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన ప్రకారం, TDS (tax deducted at source) & TCS (tax collected at source)కు సంబంధించి కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు ప్రజలకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు & విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థులకు గొప్ప ఊరట కలిగిస్తాయి. నూతన ఆర్థిక సంవత్సరం, అంటే 01 ఏప్రిల్ 2025 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.
TDS/TCS రూల్స్ కొత్త మార్పులు ఇవీ..
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 193 ప్రకారం, సెక్యూరిటీలపై వచ్చే వడ్డీ ఆదాయంపై ఇప్పటి వరకు ఎలాంటి పన్ను TDS మినహాయింపు (threshold) లేదు. ఏప్రిల్ 01, 2025 నుంచి ₹10,000 వరకు మినహాయింపు లభిస్తుంది.
సెక్షన్ 193 ప్రకారం, పబ్లిక్ కంపెనీ జారీ చేసిన డిబెంచర్లపై వ్యక్తులు/HUFలు అందుకున్న ₹5,000 వరకు వడ్డీ ఆదాయంపై ఇప్పటి వరకు TDS కట్ కాదు. ఏప్రిల్ నుంచి ఈ పరిమితి ₹10,000కు పెరుగుతుంది.
సెక్షన్ 194 ప్రకారం, ₹5,000 వరకు డివిడెండ్ ఆదాయంపై ఉన్న TDS మినహాయింపు పరిమితిని ₹10,000కు పెంచారు.
సెక్షన్ 194A ప్రకారం, ప్రస్తుతం, సెక్యూరిటీలపై వడ్డీ కాకుండా ఇతర వడ్డీ ఆదాయాలపై సీనియర్ సిటిజన్‌కు ₹50,000 & ఇతరులకు ₹40,000 TDS థ్రెషోల్డ్ ఉంది. ఇది, ఏప్రిల్ నుంచి సీనియర్ సిటిజన్‌కు ₹1,00,000, ₹50,000కు పెరుగుతుంది.
సెక్షన్ 194B ప్రకారం, లాటరీలు, క్రాస్‌వర్డ్ పజిల్స్, జూదం, బెట్టింగ్ మొదలైన వాటి నుంచి (ఆన్‌లైన్ గేమ్‌లు తప్ప) గెలిచిన మొత్తం కలిపి ఆర్థిక సంవత్సరంలో ₹10,000 కంటే ఎక్కువ ఉంటే TDS చెల్లించాలి. ఏప్రిల్ నుంచి, ఒకే లావాదేవీలో ₹10,000 కంటే ఎక్కువ గెలిస్తేనే TDS చెల్లించాలి.
సెక్షన్ 194D ప్రకారం, బీమా ఏజెంట్ల కమీషన్‌లపై ప్రస్తుతం ఉన్న TDS మినహాయింపు పరిమితి ₹15,000 నుంచి ₹20,000కు పెరుగుతుంది.
సెక్షన్ 194G ప్రకారం, లాటరీ టిక్కెట్ల అమ్మకంపై కమీషన్ & ఇతర చెల్లింపు ఆదాయాలపై ఇప్పటి వరకు ఉన్న ₹15,000 TDS మినహాయింపు పరిమితి ఏప్రిల్ నుంచి ₹20,000 అవుతుంది.
సెక్షన్ 194H ప్రకారం, కమీషన్ & బ్రోకరేజ్ ఆదాయాల థ్రెషోల్డ్ కూడా ₹15,000 నుంచి ₹20,000గా మారుతుంది.
సెక్షన్ 194-I ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో అద్దె ఆదాయం ₹2,40,000 దాటుకుంటే TDS మినహాయింపు లభిస్తుంది. ఇకపై, నెలకు ₹50,000 అద్దె దాటితేనే TDS కట్ అవుతుంది.
సెక్షన్ 194J ప్రకారం, ప్రొఫెషనల్ లేదా టెక్నికల్ సేవలకు రాయల్టీ & ఫీజ్‌లపై ₹30,000 వరకు థ్రెషోల్డ్ ఉండగా, ఇకపై ₹50,000 దాటితేనే TDS కట్ అవుతుంది.
సెక్షన్ 194K ప్రకారం, మ్యూచువల్ ఫండ్ యూనిట్ల ద్వారా సంపాదించిన ₹5,000 ఆదాయంపై TDS కటింగ్ నుంచి మినహాయింపు లభిస్తుండగా, ఇకపై అది ₹10,000కు చేరుతుంది.
సెక్షన్ 194LA ప్రకారం, స్థిరాస్తి (వ్యవసాయ భూమి కాకుండా) పరిహారం విషయంలో ఇప్పటి వరకు ₹2,50,000 థ్రెషోల్డ్ ఉండగా, ఏప్రిల్ 2025 నుంచి అది డబుల్ అవుతుంది & ₹5,00,000కు చేరుతుంది.
టాక్స్ పేయర్ నిర్దిష్ట కాలానికి ITR సమర్పించడంలో విఫలమైతే, అధిక రేటుతో TDS కట్ చేసే సెక్షన్ 206AB ఇకపై వర్తించదు. ఫలితంగా, సెక్షన్ 194S కూడా రద్దవుతుంది.
పన్ను చెల్లింపుదారు నిర్దిష్ట కాలానికి ITR సమర్పించడంలో సమర్పించడంలో విఫలమైతే అధిక రేట్లతో TCS వసూలుకు వీలు కల్పించే సెక్షన్ 206CCA కూడా ఇకపై కనిపించదు. ఇవి రెండూ ఊరట కలిగించేవే.
లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన విదేశీ చెల్లింపులు ₹7 లక్షలు దాటితే, సెక్షన్ 206C (1G) కింద TCS ఉంటుంది. ఈ పరిమితి ఏప్రిల్ నుంచి ₹10 లక్షలకు పెరుగుతుంది.
విద్యారుణం తీసుకుని & ఆ డబ్బును విదేశీ విద్యాసంస్థ ఫీజు కోసం విదేశీ కరెన్సీ చెల్లిస్తే, సెక్షన్ 206C(1G) కింద TCS వసూలు చేయరు.
ఈ రూల్స్ ఏప్రిల్ 01, 2025 నుంచి, అంటే అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2025-26 నుంచి వర్తిస్తాయి.
స్మార్ట్ కూలింగ్, స్మార్టర్ సేవింగ్స్: బజాజ్ బ్లాక్ బస్టర్ ఈఎంఐ రోజులలో హిటాచి ఏసిలను కొనండి
Children Bank Account: పిల్లల బ్యాంక్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలి ? ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి?
Tax Saving Tips: రూ.18 లక్షల జీతంపైనా "జీరో టాక్స్" - చట్టాన్ని మీ చుట్టం చేసుకోవచ్చు!
Multiple Credit Cards: ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా, తగ్గుతుందా?
Dividend: 17 నెలల పసివాడు సంపాదించిన డివిడెండ్ రూ.3.3 కోట్లు - ఎవరీ ఏకాగ్ర?
Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
Andhra Pradesh: ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే