Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Avatar Fire And Ash - Varanasi Movie: జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలోని 'అవతార్: ఫైర్ అండ్ యాష్' డిసెంబర్ 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయనతో రాజమౌళి ముచ్చటించారు.

ప్రపంచం మొత్తం ఈ వారం (డిసెంబర్ 19న) థియేటర్లలోకి రానున్న 'అవతార్ 3: ఫైర్ అండ్ యాష్' (Avatar: Fire And Ash) కోసం ఎదురు చూస్తోంది. సినిమా చూడాలని కోరుకుంటోంది. అయితే... 'అవతార్ 3' దర్శకుడు, లెజెండరీ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరూన్ ఎదురు చూస్తున్నది ఎందుకో తెలుసా? ఆయన చేసిన రిక్వెస్ట్ ఏమిటో తెలుసా? దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సెట్ విజిట్! ఆ వివరాల్లోకి వెళితే...
వారణాసి సెట్‌కు రావచ్చా? మన జక్కన్నకు జేమ్స్ రిక్వెస్ట్!
'అవతార్ 3' శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో జేమ్స్ కామెరూన్ (James Cameron)తో రాజమౌళి (SS Rajamouli) సంభాషించారు. అదీ వీడియో కాల్ రూపంలో! అయితే... ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆల్రెడీ రాజమౌళికి 'అవతార్: ఫైర్ అండ్ యాష్' సినిమా చూపించారు.
''ప్రేక్షకులు అందరి కంటే ముందు 'అవతార్: ఫైర్ అండ్ యాష్' చూడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. సినిమాను తీసిన విధానానికి నిజంగా హ్యాట్సాఫ్. నేను 'అవతార్ 3' చూస్తున్నంత సేపూ చిన్న పిల్లాడిని అయిపోయా. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సినిమా గురించి ఆలోచనలు వెంటాడాయి. హీరో జేక్ తీసుకునే నిర్ణయాలు, అతను డైలమాలో పడే సన్నివేశాలు అద్భుతంగా చూపించారు. నేను ఇంకా చెబితే స్పాయిలర్ అవుతుంది. వెండితెరపై మిగతా ఫిలిం మేకర్లకు 'అవతార్' ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది'' అని రాజమౌళి చెప్పారు.
రాజమౌళిని 'వారణాసి' అప్డేట్ అడిగి తెలుసుకున్నారు జేమ్స్ కామెరూన్. 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో వాళ్లిద్దరూ కలుసుకున్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' చూసిన జేమ్స్ కామెరూన్, తన స్పందన చెప్పారు కూడా. ఇప్పుడు రాజమౌళిని ''వారణాసి సెట్‌కు రావచ్చా?'' అని అడిగారు. ఆయన విజ్ఞప్తికి రాజమౌళి స్పందిస్తూ... ''మీ రాక మాకు ఎంతో సంతోషం. మీరు వస్తే మా 'వారణాసి' యూనిట్ మాత్రమే కాదు... మా ఇండస్ట్రీ అంతా ఎంతో థ్రిల్ అవుతుంది'' అని చెప్పారు. పులులతో షూటింగ్ చేస్తే చెప్పమని జేమ్స్ కామెరూన్ అడిగారు. అంటే... 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ - పులి మధ్య ఫైట్, అలాగే ఇంటర్వెల్ సీక్వెన్స్ లో పులి విజువల్స్ హైలైట్ అయిన సంగతి తెలిసిందే.





















