The Raja Saab BO Prediction: హిందీలో 'రాజా సాబ్' క్రేజ్ ఎలాగుంది? అక్కడ ప్రభాస్ హారర్ కామెడీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చు?
The Raja Saab First Day Collection Hindi Belt: జనవరి 9న ప్రభాస్ హారర్ కామెడీ 'ది రాజా సాబ్' థియేటర్లలో విడుదల కానుంది. హిందీ ఈ మూవీ క్రేజ్ ఎలా ఉంది? ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటారు. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా ప్రభాస్ (Prabhas)ను చాలా మంది ఇష్టపడతారు. అతని సినిమాలు హిందీ బెల్ట్‌లో కూడా మంచి వసూళ్లు సాధిస్తాయి. ఈసారి ప్రభాస్ కొత్త జోనర్‌తో రాబోతున్నాడు. ఎప్పుడూ యాక్షన్ సినిమాలు చేసే అతను... ఈ సారి హారర్ - కామెడీ సినిమా 'ది రాజా సాబ్'తో థియేటర్లలోకి వస్తున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్‌లో హారర్ - కామెడీ క్రేజ్ బాగా నడుస్తోంది. 'స్త్రీ' తర్వాత 'థామా' సహా అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధించాయి. ఈ జాబితాలో ప్రభాస్ 'ది రాజా సాబ్' కూడా చేరుతుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. జనవరి 9న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు. హిందీ బెల్ట్‌లో మొదటి రోజు ఎంత వసూలు చేయగలదో చూద్దాం.
హిందీ బెల్ట్‌లో 'ది రాజా సాబ్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
బాలీవుడ్ మీడియా సంస్థల ప్రకారం, 'ది రాజా సాబ్' మొదటి రోజున హిందీలో 6 నుంచి 9 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో వసూళ్ళు కలిపితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది.
View this post on Instagram
ప్రభాస్ తన సినిమాలతో హిందీ సర్క్యూట్‌లో మంచి ఓపెనింగ్‌లు ఇచ్చాడు. అయితే, ఆ సినిమాలు ఎక్కువగా యాక్షన్ జోనర్‌కు చెందినవి. ఇప్పుడు హిందీలో హారర్ - కామెడీ జోనర్ హావా నడుస్తోంది. సౌత్ హారర్ కామెడీకి అక్కడ ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి. ఈ సినిమాలోని రెండో పాట... ప్రభాస్, నిధీ అగర్వాల్ మీద తీసిన గీతాన్ని ఇవాళ విడుదల చేయనున్నరు.
Also Read:Jai Akhanda: 'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!
View this post on Instagram
'ది రాజా సాబ్'కు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర చేశారు.





















