Rashmika: ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్ క్రష్‌కు ముందే తెలిసిందా?
Robinhood Response: నితిన్, శ్రీలీల జంటగా నటించిన 'రాబిన్ హుడ్' మూవీలో ముందుగా రష్మిక మందన్నను హీరోయిన్ గా అనుకున్నారు మేకర్స్. తరువాత ఆమె తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చి చేరింది.

'భీష్మ' మూవీతో సక్సెస్ ఫుల్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల. తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి 'రాబిన్ హుడ్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ మూవీకి వచ్చిన టాక్ చూస్తుంటే రష్మిక మందన్న ఈ డిజాస్టర్ నుంచి భలే ఎస్కేప్ అయ్యిందే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
'రాబిన్ హుడ్' నుంచి రష్మిక ఎస్కేప్
టాలీవుడ్ హీరో నితిన్ ఖాతాలో చివరగా హిట్టు పడింది 'భీష్మ' మూవీతోనే. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో మరోసారి వెంకి కుడుముల దర్శకత్వంలో 'రాబిన్ హుడ్' సినిమా చేసిన ఆయన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం థియేటర్లలో ఈ మూవీకి నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది. నితిన్ తో పాటు ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన శ్రీలీలను కూడా రిజల్ట్ నిరాశ పరిచింది. నిజానికి 'రాబిన్ హుడ్' సినిమాలో ముందుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుంచి రష్మిక మందన్న సైడ్ అయ్యింది.
మూవీ షూటింగ్ దశలో ఉన్నప్పుడు రష్మిక మందన్న ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏంటి ? అన్న విషయంపై తీవ్రంగా చర్చ నడిచింది. 'రాబిన్ హుడ్' ప్రమోషన్లలో రష్మిక మందన్న డేట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమా నుంచి తప్పుకుందని టీం సర్ది చెప్పింది. మరోవైపు శ్రీలీల సైతం సినిమా ప్రమోషన్లలో రష్మిక మందన్న మూవీ నుంచి తప్పుకోవడం గురించి స్పందిస్తూ... ఆమెకు ఈ పాత్ర చాలా నచ్చిందని, కానీ పలు అనివార్య కారణాలు సినిమా నుంచి తప్పుకుందని వెల్లడించింది. తనకు కూడా ఈ పాత్ర నచ్చడంతోనే అంగీకరించానని, రష్మిక మందన్న 'పుష్ప 2' సెట్ లో కలిసినప్పుడు 'రాబిన్ హుడ్' మూవీ విషయమై తనకు "ఆల్ ది బెస్ట్" చెప్పిందని వెల్లడించింది. కానీ తాజాగా మూవీ రిజల్ట్ చూశాక కారణం ఏదైనా రష్మిక మందన్న 'రాబిన్ హుడ్' డిజాస్టర్ నుంచి భలేగా తప్పించుకుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా రష్మికకు ఈ మూవీ రిజల్ట్ ముందే తెలిసిందా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ శ్రీలీల మాత్రం బలయ్యింది.
శ్రీలీల ఖాతాలో మరో డిజాస్టర్
శ్రీలీల టాలీవుడ్లోకి 'పెళ్లి సందడి' సినిమాతో అడుగు పెట్టింది. కానీ ఆమెకు బ్రేక్ ఇచ్చింది మాత్రం మాస్ మహారాజా రవితేజతో చేసిన 'ధమాకా' మూవీ. ఇక ఆ తర్వాత ఇదే జోష్ ని కంటిన్యూ చేస్తూ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. చివరగా శ్రీలీల ఖాతాలో పడ్డ బ్లాక్ బస్టర్ మూవీ 'భగవంత్ కేసరి'. ఆ తర్వాత చేసిన 'ఆదికేశవ', 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలు వరుసగా బోల్తా పడ్డాయి. 'గుంటూరు కారం' మూవీ యావరేజ్ టాక్ తో పర్లేదు అనిపించింది. ఇక ఈ సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ ఫుల్ ట్రెండ్ అయింది. ఈ వరుస డిజాస్టర్ల నేపథ్యంలోనే శ్రీలీల కాస్త బ్రేక్ ఇచ్చి తాజాగా 'పుష్పట 2'లోని 'కిస్సిక్' సాంగ్ తో మరోసారి పాపులర్ అయింది. కానీ తాజాగా 'రాబిన్ హుడ్'తో మళ్ళీ తన ఖాతాలో ఇంకో డిజాస్టర్ ని వేసుకుంది ఈ అమ్మడు. దీంతో శ్రీలీల డిజాస్టర్ సినిమాలను వెతుక్కుంటూ వెళ్తుందా? లేదంటే అవే ఈ అమ్మడిని వెతుక్కుంటూ వస్తున్నాయా అంటున్నారు అభిమానులు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

