Robinhood Box Office Collection Day 1: 'రాబిన్‌హుడ్'కు మైండ్ బ్లాక్ అయ్యే ఓపెనింగ్... నితిన్ సినిమాకు ఇంత తక్కువ వసూళ్లు ఏంటి?
Robinhood First Day Box Office Collection: 'రాబిన్‌హుడ్' సినిమాకు మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఆ ఎఫెక్ట్ కనిపించింది. ఓపెనింగ్ డే కలెక్షన్స్ మరీ తక్కువగా ఉన్నాయి.

Nithiin and Sreeleela's robinhood first day box office collection worldwide: 'రాబిన్ హుడ్' ప్రేక్షకుల మనసు దోచుకోవడంలో విఫలం అయ్యాడు. మొదటి రోజు మొదటి ఆట నుంచి ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. ఆ ఎఫెక్ట్ బాక్సాఫీస్ మీద కనిపించింది. దాంతో మరి తక్కువ వసూళ్లు వచ్చాయి.
ఇండియాలో నెట్ కలెక్షన్ రెండు కోట్లు మాత్రమే!
నితిన్ కథానాయకుడిగా 'భీష్మ' వంటి విజయవంతమైన సినిమా తర్వాత దర్శకుడు వెంకీ కుడుముల తీసిన సినిమా 'రాబిన్ హుడ్'. థియేటర్లలోకి రావడానికి ముందు విపరీతమైన ప్రచారం చేశారు. హీరో నితిన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూస్ నుంచి పబ్లిక్ ఫంక్షన్స్ అటెండ్ కావడం వరకు తన శక్తి మేరకు కష్టపడ్డాడు. కానీ ఫలితం లేదు.
రాబిన్ హుడ్ సినిమాకు మొదటి రోజు ఇండియాలో రెండు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయని తెలిసింది. వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూస్తే... ఐదు కోట్ల లోపు మాత్రమే. ఈ సినిమా కాస్త అటు ఇటుగా నాలుగున్నర కోట్ల రూపాయల గ్రాస్ ప్రపంచ వ్యాప్తంగా సాధించిందని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందింది. షేర్ చూస్తే రెండు కోట్ల కంటే తక్కువ ఉందట. కానీ మూవీ టీమ్ తమ సినిమా సక్సెస్ అంటోంది.
70 కోట్లు బడ్జెట్ పెడితే కనీసం ఏడు కోట్లు రాలేదా!?
నితిన్ హీరోగా ఒక వెంకీ కుడుమల దర్శకత్వం వహించిన 'రాబిన్ హుడ్' చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఖర్చు చేసింది. సుమారు 70 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో సినిమా తీసింది. అయితే ఏడు కోట్ల రూపాయల వసూళ్లు కూడా మొదటి రోజు రాలేదు. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఫ్లాప్ తర్వాత నితిన్ శ్రీ లీల జంట మరో ఫ్లాప్ తమ ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాను ఆల్మోస్ట్ 40 కోట్ల రూపాయలకు అమ్మారు. థియేటర్స్ నుంచి అంత రెవెన్యూ (షేర్) వచ్చే పరిస్థితులు అస్సలు లేవు.
'రాబిన్ హూడ్'లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించిన సంగతి తెలిసిందే. సినిమా ఆఖరిలో ఆయన వస్తారు. క్లైమాక్స్ సీన్ వరకు విజిల్స్ వేయించారు. అయితే ఆ సీన్ వచ్చేసరికి ప్రేక్షకులకు నీరసం వచ్చేలా సినిమాను తీశారు వెంకీ కుడుముల. ఒకవేళ గనక సీక్వెల్ తీస్తే అందులో డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ కీలకం అవుతుంది. ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ చూస్తే సీక్వెల్ పరిస్థితులు కనిపించట్లేదు. ఈ సినిమా కోసం డేవిడ్ వార్నర్ రెండు రోజులు మాత్రమే షూటింగ్ చేసి రెండు కోట్ల రూపాయల పారితోషకం అందుకున్నారని ఫిలిం నగర్ వర్గాలు తెలిపాయి. కనీసం ఆయనకు ఇచ్చిన డబ్బులు కూడా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర రాలేదు.





















