(Source: ECI | ABP NEWS)
TGPSC Group1 Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ, డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల జనరల్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇటీవల మార్కులు వెల్లడించిన కమిషన్ అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం జనరల్ ర్యాంగ్స్ రిలీజ్ చేసింది.

TSPSC Group1 Results: హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-1 అభ్యర్థులకు తెలుగు సంవత్సరాది ఉగాది నాడు శుభవార్త చెప్పింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల జనరల్ ర్యాంకింగ్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ ర్యాంకులను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇటీవల మార్కుల జాబితా విడుదల
తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ఫలితాలను మార్కుల రూపంలో ఇటీవల విడులయ్యాయి. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గత ఏడాది అక్టోబర్ నెలలో వారం రోజులపాటు పరీక్షలు నిర్వహించింది. వాటి ఫలితాలను టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం కొన్ని రోజుల కిందట విడుదల చేశారు. మెయిన్స్ పరీక్షలకు మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరుకాగా, మార్కుల జాబితా విడుదల చేసి... అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ కు అభ్యంతరాలు స్వీకరించారు. ప్రక్రియ పూర్తయ్యాక జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/లో ఫలితాలు చెక్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.
గ్రూప్ 1 మార్కుల కోసం క్లిక్ చేయండి https://websitenew.tspsc.gov.in/checkMarksObtainedBytheCandidate?accessId=GRPACEOQ2412
2024 ఫిబ్రవరి 19న టీజీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,03,645 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు. మెయిన్స్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో మొత్తం 31,382 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. హైకోర్టు అనుమతితో మరికొందరు మెయిన్స్ కు అర్హత సాధించారు. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్ పరీక్షలు నిర్వహించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన వారిలో మొత్తం 31,403 మందిని మెయిన్స్ పరీక్షలకు ఎంపికయ్యారు. వీరిలో 21,093 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఇంగ్లీష్ పేపర్ పాస్ అయితేనే..
ఇంగ్లిష్‌తో పాటు మరో 6 సబ్జెక్టులకు సంబంధించి మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఒక్కో పేపర్ 150 మార్కులు ఉంటుంది. ఇంగ్లిష్ పరీక్షను మాత్రం కేవలం క్వాలిఫై టెస్టుగా పరిగణిస్తారని తెలిసిందే. అయితే ఇంగ్లీష్ పేపర్లో క్వాలిఫై అయితేనే ఆ అభ్యర్థులకు మిగిలిన ఆరు పేపర్లలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఇంగ్లిష్‌లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం మార్కులు వస్తేనే క్వాలిఫై అవుతారు. ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై అయితే మిగతా ఆరు సబ్జెక్టులకు సంబంధించి 900 మార్కులకు అభ్యర్థులకు వచ్చే మార్కులను బట్టి జనరల్ ర్యాంకింగ్ లిస్టులను టీజీపీఎస్సీ విడుదల చేసింది.






















