Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Telangana Group 2 Results | తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవాలని చైర్మన్ వెంకటేశం సూచించారు.

TGPSC Group 2 Results | హైదరాబాద్: గ్రూప్ 2 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అప్డేట్ ఇచ్చింది. గ్రూప్ 2 పరీక్షల ఫలితాలు (Group 2 Results) టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 గ్రూప్ 2 పోస్టులు 2024 డిసెంబర్ 15, 16 తేదీలలో పరీక్ష నిర్వహించారు. గ్రూప్ అభ్యర్థుల మార్కులను, జనరల్ ర్యాంకు జాబితాను తాజాగా టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 2 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవాలని టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం సూచించారు. ఎలాంటి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయకుండా అభ్యర్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ 2 ఫలితాల కోసం క్లిక్ చేయండి.
రిజల్ట్ పేజీ క్లిక్ చేసిన తరువాత ఓపెన్ అయిన పీడీఎఫ్ లో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్ చూసుకోండి. ఒక్కో పేపర్ 150 మార్కులు చొప్పున మొత్తం రెండు రోజులపాటు 4 పేపర్లు నిర్వహించారు. 150 క్వశ్చన్స్ ఉండగా, ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు కేటాయించారు. ఇందులో ఎలాంటి నెగటివ్ మార్కింగ్ లేదు. టీజీపీఎస్సీ సోమవారం నాడు గ్రూప్ 1 మెయిన్స్ రాత పరీక్షా ఫలితాలు విడుదల చేసింది. ఫలితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేయాలి. ఆ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఆ ప్రక్రియ సైతం పూర్తయితే గ్రూప్ 2 పోస్టులకు ఎంపికైన వారి తుది జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించనుంది. గ్రూప్ 2 ఫలితాలపై అభ్యంతరాలు లాంటివి వస్తే.. అంతా పూర్తిచేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం మరో రిజల్ట్ విడుదల చేస్తారు. తరువాత గ్రూప్ 2 పోస్టులకు ఎంపికైన వారి తుది జాబితా ప్రకటించనున్నారు. టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్
గ్రూప్ 2 ఏ పోస్టులు ఉంటాయంటే..
తెలంగాణ ఏర్పాటయ్యాక ఒకసారి గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేశారు. గత ఏడాది గ్రూప్ 2 నిర్వహించినా పేపర్ల లీకులతో పలు ఎగ్జామ్స్ ఫలితాలు రద్దు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం టీజీపీఎస్సీలో ప్రక్షాళన చేపట్టి గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఏడాది డిసెంబర్ నెలలో పరీక్ష నిర్వహించి మార్చి 11న మార్కుల వివరాలు, జనరల్ ర్యాంకింగ్స్ రిలీజ్ చేసింది. గ్రూప్ 2 పరీక్ష ద్వారా మున్సిపల్ కమిషనర్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఏసీటీవో, తహసిల్దార్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నెక్ట్స్ గ్రూప్ 3 ఫలితాలు
ఇదివరకే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల మార్కుల జాబితా విడుదల చేసిన టీజీపీఎస్సీ త్వరలో గ్రూప్ 3 ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నెల 20లోపు హాస్టల్ వెల్‌ఫేర్ ఆఫీసర్స్ పోస్టులు, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ ఎగ్జామ్ మార్కులు, జనరల్ ర్యాంకింగ్స్ వివరాలు టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల ప్రక్రియ కనుక పూర్తయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. ఆ ప్రక్రియ పూర్తయితే ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నారు.






















