అన్వేషించండి

UPSC: కేంద్ర సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

UPSC: కేంద్ర సాయుధ బలగాలలో అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టుల భ‌ర్తీకి యూపీఎస్సీ నోటిఫికేష‌న్‌ విడుద‌ల చేసింది. 'సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ ఎగ్జామినేషన్‌-2025' ద్వారా ఖాళీలను భర్తీచేస్తారు.

Central Armed Police Forces (ACs) Examination, 2025: కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్‌ (BSF), సీఆర్‌పీఎఫ్‌ (CRPF), సీఐఎస్‌ఎఫ్‌ (CISF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమాబల్ (SSB) ద‌ళాల్లో అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టుల భ‌ర్తీకి 'సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2025' నోటిఫికేష‌న్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 5న విడుద‌ల చేసింది. దీనిద్వారా మొత్తం 357 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

వివరాలు.. 

* సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2025

ఖాళీల సంఖ్య: 357. 

➥ బీఎస్‌ఎఫ్‌: 24 పోస్టులు

➥ సీఆర్‌పీఎఫ్‌: 204 పోస్టులు 

➥ సీఐఎస్‌ఎఫ్‌: 92 పోస్టులు

➥ ఐటీబీపీ: 04 పోస్టులు

➥ సశస్త్ర సీమాబల్: 33 పోస్టులు  

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

వయోపరిమితి: 01.08.2025 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.08.2000 - 01.08.2005. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 

ఎంపిక విధానం: రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ఫిజికల్ స్టాండర్డ్స్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  

పేపర్-1 పరీక్ష విధానం:  మొత్తం 250 మార్కులకు పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇందులో జనరల్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, ఇండియా & వరల్డ్ జియోగ్రఫీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

పేపర్-2 పరీక్ష విధానం:  మొత్తం 200 మార్కులకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జనరల్ స్టడీస్, ఎస్సే అండ్ కాంప్రహెన్షన్ అంశాలు ఉంటాయి. ఇందులో రెండు విభాగాలు (పార్ట్-ఎ, పార్ట్-బి) ఉంటాయి. ఇందులో పార్ట్-ఎకి 80 మార్కులు కేటాయించారు. పార్ట్-ఎలో వ్యాసరూప ప్రశ్నలు అడుగుతారు. స్వాతంత్య్రపోరాటం, జియోగ్రఫీ, పాలిటీ & ఎకానమీ, మానవ హక్కులు, అనలిటికల్ ఎబిలిటీ ఇతర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇక పార్ట్-బికి 120 మార్కులు కేటాయించారు. ఇందులో కాంప్రహెన్షన్, ప్రిసైజ్ రైటింగ్, సింపుల్ గ్రామర్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.    

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. 

ఫిజికల్ ఈవెంట్లు..
➥ అభ్యర్థులు 100 మీటర్లు పరుగు పూర్తిచేయాల్సి ఉంటుంది. పురుషులు 16 సెకండ్లలో, మహిళలు 18 సెకండ్లలో పరుగు పూర్తిచేయాలి.

➥ అదేవిధంగా 800 మీటర్ల పరుగుపందెం కూడా నిర్వహిస్తారు. పురుషులు 3 నిమిషాల 45 సెకండ్లలో, మహిళలు 4 నిమిషాల 45 సెకండ్లలో పరుగు పూర్తిచేయాల్సి ఉంటుంది.

➥ లాంగ్ జంప్‌లో మూడు అవకాశాలలో పురుషులు 3.5 మీటర్లు, మహిళలు 3.0 మీటర్లు జంప్ చేయాల్సి ఉంటుంది. 

]➥ ఇక పురుషులకు మాత్రమే షార్ట్‌పుట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు మూడు అవకాశాల్లో 7.26 కిలోల బరువుండే గుండును 4.5 మీటర్ల వరకు విసరాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు.. 

➥ ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరితేదీ: 25.03.2025.

➥ దరఖాస్తు సవరణ తేదీలు:  26.03.2025 నుంచి 01.04.2025 వరకు. 

➥ రాతపరీక్ష తేదీ: 03.08.2025. 

➥ పరీక్ష సమయం: పేపర్-1 ఉదయం.10:00 - 12:00 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2:00- 5:00 గంటల వరకు.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Embed widget